Others

ట్రేడ్‌టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తదనమంటూ పాత చింతకాయపచ్చడి కథ కథనాలే కొత్త జాడీల్లో పెట్టేసి పంపిచ్చేస్తున్నారు. ఆ సినిమాలు చూడలేక ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఈవారం అనుష్క కథానాయికగా ‘సైజ్ జీరో’, నూతన నటీనటులతో రూపొందించిన ‘తను నేను’, ‘అయ్యోరామ’, ‘లవ్ స్టేట్స్’, ‘నేనూ నా ప్రేమకథ’ చిత్రాలతోపాటుగా ఎవరూ ఎదురుచూడని సబ్జెక్టు అయిన ఇద్దరి అమ్మాయిల ప్రేమకథతో రూపొందిన ‘ఎఫైర్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలలో అనుష్క సైజ్ జీరో ఒక్కటే సోసోగా కలెక్షన్లను రాబడుతోంది. ఇక మిగతా చిత్రాలన్నీ కథ, కథనాలు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడంతో రెండు మూడు రోజుల్లోనే థియేటర్లనుండి సర్దుకున్నాయి. కొన్ని సినిమాలైతే ఎక్కడ విడుదలయ్యాయో తెలియని పరిస్థితి కూడా వుంది. ‘ఎఫైర్’ చిత్రం ప్రేక్షకుల అసహనాన్ని పరీక్షిస్తూ వ్యతిరేక వౌత్‌టాక్‌తో చతికిలబడింది.