Others

డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డౌన్‌లోడ్ నేరమే

-వీర శంకర్

శ్రీకాంత్ కథానాయకుడిగా ‘హలో ఐ లవ్‌యూ’ చిత్రంతో దర్శకత్వ ప్రస్థానం మొదలెట్టిన వీరశంకర్ -తరువాత వైవిధ్యమైన కథలను ఎంచుకుని ప్రేమకోసం, విజయరామరాజు, గుడుంబా శంకర్, మనకుర్రాళ్ళే చిత్రాలతోపాటుగా కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీర శంకర్‌తో ఈ వారం చిట్ చాట్..

మీ నేపథ్యం?
పశ్చిమ గోదావరి జిల్లా తణుకువద్ద చివటం. కర్నాటకలో డిగ్రీ వరకూ చదివాను.
దర్శకుడవ్వాలని ఎలా?
ఇంటర్మీడియెట్‌లో ఉన్నపుడు చార్లీచాప్లిన్ మోడరన్ టైమ్స్ చూశాను. సినిమా అనేది వైవిధ్యభరితమైన మీడియా అని అర్థమైంది. దర్శకుడవ్వాలని నిర్ణయించుకున్నా.
దర్శకుడిగా శిక్షణ?
కోడి రామకృష్ణ వద్ద దాదాపు ఎనిమిదేళ్లు అనేక చిత్రాలకు పనిచేశాను.
తొలి అవకాశం?
హీరో శ్రీకాంత్ స్నేహితుడు కావడంవల్ల నేను దర్శకుడిని కావడమన్న విషయం నాకన్నా అతనికే ఎక్కువ తొందరవుండేది. అలా వెనె్నల్లో ఆడపిల్ల నవలకు స్క్రిప్ట్ రాసుకున్న నేపథ్యంలో శ్రీకాంత్ చెప్పడంతో కెఎస్ రామారావు తొలి అవకాశం ఇచ్చారు.
ఇష్టమైన జోనర్స్?
ఏదైనా ఇష్టమే. సినిమా చూసి చెడిపోయారన్న కంటెంట్ లేని ఏ కథైనా ఇష్టపడతాను. సినిమా సోషల్ రెస్పాన్స్ కలిగివుండాలి.
ప్రస్తుతం లవ్, హారర్ జోరు ఎలా వుంది?
మీరన్నట్లు లవ్ అనేది ఎప్పటికీ ఎవర్‌గ్రీనే. ఇక హారర్‌ను ప్రేక్షకులు మొహమెత్తిపోయారు. ఆ జోనర్‌లో సినిమాలు తగ్గుతున్నాయి. థ్రిల్లర్ అనేది ఎప్పటికీ ప్రేక్షకులకు నచ్చుతూనే వుంటుంది.
పరిశ్రమలో సమస్యలు?
పైరసీ మీద ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలంటారేగాని, నిజంగా సమస్య ఎక్కడినుండి ప్రారంభమవుతుందన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. సినిమాను డౌన్‌లోడ్ చేసి నెట్‌లో పెట్టేవాళ్లూ నేరస్థులే. పైరసీ సీడీని చూసేవాళ్ళని పట్టుకుంటే సరిపోదు. కళాదోపిడీకారులను పట్టుకోగలగాలి.
దర్శకుడంటే?
ప్రేక్షకుడికన్నా ముందుగా సినిమా చూసేవాడు. సన్నివేశాలను ఊహించి థియేటర్‌లో ప్రేక్షకుణ్ణి తన ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళేవాడు. స్క్రీన్‌కు, ప్రేక్షకుడి కళ్ళకు రెండు గంటలపాటు చెరిగిపోని వారధి నిర్మించేవాడు.

-శేఖర్