Others

పిచ్చి పిచ్చి ఫ్రెండ్స్! -- శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చిత్రం చూస్తుంటే ఎలా వుంది? దాదాపుగా స్వర్ణయుగంలోని నటీమణులంతా ఒక్కటై చిత్రంలో కనిపిస్తున్నట్టుంది కదూ! ఇంతమంది కాల్షీట్లు ఒక్క సినిమా కోసం దొరకడం అనేది అప్పట్లో దుర్లభం. ఇంతమంది నటీమణులను ఒకచోటకు చేర్చి మంచి ఎపిసోడ్‌ను చిత్రీకరించడం కత్తిమీద సామే. అటువంటి సాముగరిడీ చేయగలిగింది ఒక్క సావిత్రి మాత్రమే! నిర్మాతగా మారి ‘నవరాత్రి’ చిత్రాన్ని రూపొందిస్తున్న సావిత్రికోసం కాల్షీట్లు లేకపోయినా అడ్జెస్ట్ చేసి ఈ ఎపిసోడ్‌లో నటించారు సూర్యకాంతం, ఛాయాదేవి, గిరిజ, గీతాంజలి, జమున, కాంచన, జయలలిత. మొదటి నలుగురూ హాస్యాన్ని పండించేవారైతే, చివరిలోని ముగ్గురూ కథానాయికలుగా అగ్రశ్రేణిలో ఉన్నవారు. ఇంతమందిని ఒకచోటకు చేర్చి పిచ్చాసుపత్రి ఎపిసోడ్‌ను చిత్రీకరించడం సావిత్రికే సాధ్యమైంది. తాతినేని రామారావు దర్శకుడిగా ఈ చిత్రంతోనే పరిచయమయ్యారు. సహజనటి సావిత్రిమీదున్న గౌరవంతో నటీమణులంతా సహకరించారు. ఇందుకు ప్రతిఫలంగా రెమ్యూనరేషన్ రూపంలో ఏమీ ఆశించకపోయినా -సావిత్రి మాత్రం తలాఒక బంగారు నగను వాళ్లకు ప్రెజెంట్ చేశారు. నాగేశ్వరరావు మొదటిసారిగా ద్విపాత్రాభినయం ఇద్దరు మిత్రుల్లో చేసినా, ఈ చిత్రంలో తొమ్మిది పాత్రల్లో నటించి రికార్డు సృష్టించారు. 1966 ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదలై విజయఢంకా మోగించింది. ఈ ఎపిసోడ్‌లో రాజకీయ నాయకురాలిగా శ్రీకాకుళం మాండలికంలో గిరిజ చేసిన పిచ్చి ఉపన్యాసం అందరినీ ఆకట్టుకుంటుంది. సూర్యకాంతం పీ.. పీ అని పాడుతూ రెండు జడలు ముందువైపు వేసి అద్భుతంగా నటించారు. కాంచనకు గతంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో ఈ పిచ్చి పాత్రలో అదేవిధమైన మానరిజమ్‌తో నటించారు. తమిళనాడు సిఎం జయలలిత తలపై పూలతో కిరీటం అల్లుకుని బెడ్‌పై డాన్స్ చేస్తారు. ఛాయాదేవి వచ్చి ఈరోజు నవరాత్రిలో ఆరవ రోజు కదా, బొమ్మలు కొనుక్కుని బొమ్మలకొలువు పెట్టుకుందాం రా రండే అని మిగతావాళ్ళని పిలుస్తుంది. గిరిజ ‘అద్దాల మేడ వుంది, మేడ పక్క గోడ వుంది’ పాట పాడుతుంది. జయలలిత సూర్యకాంతం నుదురుపై వున్న రెండు జడలు పట్టుకుని నిలువవే జంట జడలదానా అంటూ ఆట పట్టిస్తుంది. ఛాయాదేవి ‘ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో.. హోయ్ హోయ్’ అంటూ మంచంమీద వాలిపోతుంది. మళ్లీ సూర్యకాంతం ‘వివాహ భోజనంబు’ పాట స్టైల్లో ‘డాక్టర్లు మారినారు, రోగాలు కుదరలేదు’ అంటూ ఘటోత్కచునిలా నటిస్తుంది. ఈ పాటలో మరో విశేషమేమిటంటే జయలలితను జమున ఆమె పాటతో ఎగతాళి చేస్తే, జమున జయలలిత పాటతో హాస్యాన్ని సృష్టించారు. ‘గౌరమ్మో నీ కొడుకెవరమ్మో’ అంటూ జయలలిత జమునను ఉద్దేశించిపాడితే, జమునేమో ‘చలి వేస్తోందా చలివేస్తోందా’ అంటూ జయలలిత పాటైన ‘సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా’ పాటను గుర్తుచేస్తూ అభినయించారు. కాంచన వచ్చి గీతాంజలితో ‘మామా మామా’ పాట బాణీలో ‘్భమా భామా’ అంటూ తుళ్లి గెంతులేస్తుంది.
సావిత్రి వచ్చి ‘నాదీ ఆడజనే్మ’ చిత్రంలో ‘నా మాట నమ్మితివేల నా మీద కోపమదేల’ పాట స్టైల్లో ‘బస్కీలు కొట్టేదానా, కుస్తీలు పట్టేదానా’ అంటూ ఛాయాదేవిని ఆట పట్టిస్తుంది. చివరికి సూర్యకాంతం, ఛాయాదేవి ఒక జట్టుగా, గిరిజ, గీతాంజలి, కాంచన ఒక జట్టుగా రాకెన్‌రోల్ డాన్స్ చేస్తారు. పాట ‘రాకు రాకు రాకు రోలు రోలు రోలు’ అంటూ ఆలపించి నవ్వులు చిలికించారు. ఈ పాటే ఇపుడు వచ్చిన గబ్బర్‌సింగ్ చిత్రంలోని అంత్యాక్షరి పాటకు ప్రేరణ ఇచ్చి వుండొచ్చు. అంత్యాక్షరి ఎంత హిట్ అయిందో అప్పట్లో ఈ పాట అంత విజయవంతం అయింది. కానీ, ఈ స్టిల్ మాత్రం సినిమాలో కనపడదు. అది ఛాయచిత్రం విశేషం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717