Others

నవ్వించే డాక్టర్యాక్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటుంటారు. ముందు -డాక్టరై ఆనక యాక్టరైన భద్రమ్ తాజాగా సినీ పరిశ్రమలో నవ్వులు పూయించే పనిలోవున్నాడు. ‘పెళ్లిలో జర భద్రమ్’ అన్న చిన్న వీడియో అతని భవిష్యత్తునే మార్చేసింది. మొదటినుండీ నటనపై ఆసక్తివున్న భద్రమ్ -ఆ వీడియోతో ముందు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ మన్ననలు అందుకున్నాడు. దాదాపు 50 లక్షల లైక్‌లు అందాయి. ఆ వీడియోతోనే దర్శకుడు పూరి జగన్నాథ్ దృష్టిలోపడ్డాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంలో బ్రోకర్ భద్రమ్‌గా నవ్వించాడు. గతంలో ఊహలు గుసగుసలాడే, రన్ రాజా రన్, సూర్య వర్సెస్ సూర్యలాంటి చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు -బ్రోకర్ భద్రమ్‌తో వచ్చింది. ఆ తరువాత భలే భలే మగాడివోయ్ చిత్రంలో చేసిన ప్రేమికుడి పాత్ర మరింత గుర్తింపునిచ్చింది. బెస్ట్ కామెడీ యాక్టర్‌గా ఇంటర్నేషనల్ ఫిలిం అకాడమీ నిర్వహించే పోటీల్లో 2016కుగాను ఇప్పుడు నామినేటయ్యాడు. బ్రహ్మానందం, వెనె్నల కిశోర్, శ్రీనివాసరెడ్డిలతోపాటుగా బెస్ట్ కమెడియన్‌గా నామినేట్ అవ్వడం తన జీవితంలో గొప్ప విషయమని అంటున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పుట్టిన తాను చదువంతా బెంగళూరులోనే చదివానని, ఫిజియోథెరపి చేసిన తాను ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ విభాగంలో స్పెషలైజేషన్ చేశానన్నారు. గతంలో ఎటువంటి నాటకానుభవాలు లేకున్నా సన్నిహితులు చెప్పిన మాటలతోనే నటనవైపు వచ్చానని, తాను మాట్లాడుతుంటే ప్రతి భావం ముఖంలో పలుకుతుందని వారు చెప్పిన మాటలే తనకు బలాన్నిచ్చాయని చెబుతున్నాడు భద్రమ్. ప్రస్తుతం లోఫర్‌లో పనివాడిగా, లచ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రంలో హీరో స్నేహితుడిగా నటిస్తున్నానని, ఈ రెండు పాత్రలతో మంచి గుర్తింపు వస్తుందని అంటున్నాడు. ఎలాంటి పాత్రలు ఇచ్చినా చేయగలనని, ముఖ్యంగా నవ్వించే ఏ పాత్ర ఇచ్చినా వందశాతం న్యాయం చేశాలా నటిస్తానని, డాక్టర్‌గా పేషెంట్లను, యాక్టర్‌గా ప్రేక్షుకులను నవ్విస్తూ వాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే తన ధ్యేయంగా చెబుతున్నాడు. అందుకే లాఫింగ్ డాక్టర్ అనే అంశంతో ఫిజికల్ స్ట్రెస్‌ను, మెంటల్ స్ట్రెస్‌ను పోగొట్టే నవ్వుల విందులు చేయడానికి సిద్ధమవుతున్నానని, నవ్వడం మర్చిపోయిన వారికోసం, వారి ఆరోగ్యాలు కాపాడడం కోసం ఈ లాఫింగ్ డాక్టర్ ప్రయత్నిస్తుందని ఆయన వివరించారు. నవ్వడం అనేది మనిషికున్న వరమని, ఆ వరాన్ని మర్చిపోయి నిరంతరం పనుల ఒత్తిడితో సతమతమయ్యేవారికి తన వంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తానని, భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులకు దగ్గర కావడమే తన లక్ష్యమని భద్రంగా చెబుతున్నాడు భద్రమ్!