Others

ట్రేడ్‌టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దా చిన్న హీరోలన్న సమస్యే లేదు. సినిమా బాగుంటేనే ఆదరిస్తున్నారు అన్నదానికి ఈవారం విడుదలైన ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రం ఉదాహరణగా నిలుస్తోంది. మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రంలో ఎటువంటి కొత్తదనం లేక చతికిలపడింది. అదేవిధంగా మరో పెద్ద హీరో గోపీచంద్ కథానాయకుడిగా వచ్చిన సౌఖ్యం చిత్రం నిర్మాతలకు, ప్రేక్షకులకు ఏమాత్రం సౌకర్యాన్ని ఇవ్వలేకపోయింది. సినిమా సగంలోనే ఎక్కడి జనం అక్కడ పరారవుతున్నారని ట్రేడ్‌టాక్ చెబుతోంది. ఇక నూతన తారలతో రూపొందించిన జత కలిసే చిత్రం వైవిధ్యమైన కథనంతో రూపొందించినా సరైన ఎమోషన్లు పండక సినిమా సోసోగా సాగుతోంది. బాక్సాఫీస్‌ను కొద్దో గొప్పో కళకళలాడిస్తున్న చిత్రం సుధీర్‌బాబు కథానాయకుడిగా వచ్చిన ‘్భలే మంచిరోజు’. వెరైటీ సినిమాలు కోరుకునేవారికి వౌత్ టాక్ ద్వారా ఈ చిత్రం చేరువవుతోంది. ఇప్పటికైనా కథ బాగుంటేనే సినిమా హిట్టవుతుందన్న ప్రేక్షకుల నిర్ణయం పరిశ్రమకు శిరోధార్యం కావాలి.