S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

08/25/2019 - 00:07

సానందం సదనం సుతాశ్చ సుధియః కాంతాప్రియాలాపినీ
సుధనం సన్మిత్రం స్వపోషితిరితిః స్వాజ్ఞాపరాః సేవకాః
ఆతిథ్యం శివపూజనం ప్రతిదినమిష్టాన్నపానం గృహే
సాధోః సంగముపాసతే చ సతతం ధన్యో గృహస్థాశ్రమః

08/18/2019 - 00:07

అలనాడు దేశ విభజనపై జరిగినంత చర్చ- నేడు కశ్మీర్‌లో 370వ అధికరణం రద్దు నేపథ్యంలో జరుగుతోంది. 370వ అధికరణం రద్దు వల్ల లాభమా? నష్టమా? అంటూ విభిన్న వర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు 370 రద్దును వ్యతిరేకించినా, దాన్ని జమ్మూ కశ్మీర్ ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. వారంతా ఏదో పంజరంలో నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన అనుభూతిని పొందుతున్నారు.

08/10/2019 - 18:48

పలుసార్లు ప్రత్యక్ష యుద్ధాల్లో పరాభవం పొందిన పాకిస్తాన్ చివరికి కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని రావణకాష్టంలా రాజేసింది. జిహాదీ ఉగ్రవాద సంస్థలను భారత్‌పైకి ప్రేరేపించడం, కశ్మీర్‌లోని అమాయక యువకులకు తీవ్రవాద కలాపాల్లో శిక్షణ ఇవ్వడం వంటి అనైతిక పనులకు పాక్ పాల్పడుతోందన్నది జగమెరిగిన సత్యం.

08/04/2019 - 00:09

‘ఒపీనియన్స్ ఛేంజ్ చేస్తే గానీ పొలిటీషియన్ కాడు..’ అని ‘కన్యాశుల్కం’లో గిరీశం చెప్పినట్టు.. నేడు మన రాజకీయ నాయకుల్లో చాలామంది తమ ఒపీనియన్స్‌ను తరచూ మార్చుకోవడమే కాదు.. అవకాశం దొరికినపుడు, అవసరం అనిపించినపుడు నిర్భీతిగా, నిర్లజ్జగా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. పదవుల కోసమో, సొంత పనుల కోసమో కాదు..

07/28/2019 - 00:22

ఏ పని చేసినా సెల్‌ఫోన్‌పైనే తదేక దృష్టి.. చివరికి స్నానాల గదిలోకి సైతం ‘చరవాణి’ని వెంట తీసుకెళ్లడం.. కొద్దిసేపు ఫోన్ కనిపించకపోయినా ప్రాణం పోయినట్టుగా విలవిల్లాడిపోవడం.. ఎలాంటి శబ్దం విన్నా ‘సెల్’ మోగుతున్నట్టే భావించి పదే పదే దాన్ని చూసుకోవడం.. క్షణక్షణానికీ వాట్సాప్ స్టేటస్, మిస్డ్‌కాల్ డేటా, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎస్‌ఎంఎస్‌లను ఆతృతగా చూసుకోవడం.. ఏకాంతంగా గడిపేందుకు ఇష్టపడడం..

07/21/2019 - 00:10

కళకళలాడే పచ్చని చెట్లు..
జలజలపారే నదులు..
కిలకిలమనే పక్షులు..

07/14/2019 - 00:21

బోనాలు, బతుకమ్మ, పీర్ల పండుగ, తీజ్ పండుగ తెలంగాణ బతుకు చిత్రానికి ప్రతీకలు.. తెలంగాణ మట్టి వాసనలకు నిలువెత్తు సంతకాలు.. మరే ప్రాంతంలోనూ ఇలాంటి పండుగలు లేవు. బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన శ్రామిక జీవులు సొంతూళ్లకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న చోటనే వీటిని జరుపుకోవడం వల్ల రాయలసీమలో కొన్ని చోట్లకు బోనాల పండుగ విస్తరించింది. అంతే తప్ప మరెక్కడా బోనాల వేడుకలు జరగవు.

07/07/2019 - 00:01

‘ఇడ్లీ పిండి కొంటే బకెట్ నీరు ఉచితం..’- ఇదీ చెన్నై మహానగరంలో ఓ దుకాణం యజమాని తాజాగా స్థానికులకు ఇచ్చిన ‘బంపర్ ఆఫర్..’! మన దేశంలోనే ఆరో పెద్ద నగరంగా ప్రఖ్యాతి గాంచిన చోట తాగునీటి ఎద్దడికి ఈ ఉదంతం తిరుగులేని ఉదాహరణ. వాననీరు వృథా కావడం, భూగర్భ జలాలు శుష్కించిపోవడంతో ఏర్పడిన దీనస్థితి ఇది.

06/30/2019 - 00:10

సూక్ష్మంలోనే మోక్షం ఉంది.
-ఇది పూర్వీకుల మాట.
అందుకే -మోక్షం పొందాలంటే సూక్ష్మాన్ని గ్రహించాలంటాడు శ్రీకృష్ణుడు. ‘పాండవ వనవాసం’లో నిద్రపోతున్న భీముణ్ణి తట్టి మరీ చెప్పాడు. మరి -సూక్ష్మాన్ని గ్రహించడమెలా? అంటే -అనంతాన్ని ఔపోసన పట్టాలి. ఆ పనిలోనే ఉన్నాడిప్పుడు మనిషి.
**
లాస్ట్ సిప్‌తో టీ పూర్తి చేసి.. చప్పుడు చేయకుండా -కప్పు కిందపెట్టాను- వాడు చెప్తున్నది వింటూనే.

06/23/2019 - 00:02

ఒకవైపు రెండో చంద్రయానానికి సిద్ధపడుతూ.. మరోవైపు మూడేళ్లలో ముగ్గురు వ్యోమగాములతో గగనయానానికి అడుగులేస్తూ.. ఇంకోవైపు మనకంటూ సొంతంగా ఓ ‘అంతరిక్ష కేంద్రం’ నిర్మాణానికి పకడ్బందీ ప్రణాళికలను రూపొందిస్తూ ‘ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ’ (ఇస్రో) దూకుడును పెంచింది. తొలినాళ్లలో కొన్ని అపజయాలు, అవాంతరాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ‘ఇస్రో’ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది.

Pages