S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ వారం స్పెషల్
‘సూర్యో మరీచి మాదత్తె సర్వస్మాద్భువనాదధి, తస్యాః పాక విశేషేణ స్మృతం కాల విశేషణమ్’
సూర్యుడు సర్వ ప్రపంచమునకు పై భాగము నందుండి, కిరణములను ప్రసరింపజేస్తున్నాడు. సర్వ విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. సూర్య కిరణముల పరిపాక విశేషము చేత సంవత్సరము, ఆయనములు ఋతువులు, మాసములు పక్షములు దినములు, రాత్రింబవళ్లు మొదలగు కాల భేదములు ఏర్పడుతున్నాయని యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం చెప్పింది.
రోజురోజుకీ వేగం పెరిగిపోతోంది. ప్రతి విషయంలోనూ ఉరుకులు పరుగులే.. టెక్నాలజీ, విద్య, వైద్యం, ఆటలు.. ఇలా ఒకటేమిటి? అన్ని రంగాలు వడివడిగా, కాలానుగుణంగా దూసుకుపోతున్నాయి. 1990ల్లో కంప్యూటర్.. 2000 తరువాత స్మార్ట్ ఫోన్.. 2010లో నానోటెక్నాలజీ.. ఇలా టెక్నాలజీ ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి. ఈ సాంకేతిక మార్పులు మనిషి నడవడికను, జీవన విధానాన్ని సమూలంగా మార్చేశాయి.
తెలుగు చిత్రసీమ
వేగంగా మారుతోంది.
అంతకంటే వేగంగా విస్తరిస్తోంది.
వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ -తనదైన సత్తా చాటుతోంది. ప్రమాణాలు దాటెళ్తూ -సరికొత్త అడుగులేస్తోంది. వినోదాత్మక కథలను తెరకెక్కిస్తూ, వ్యాపారాత్మక ప్రాజెక్టులు రూపొందిస్తూ.. సినిమా కేరాఫ్ టాలీవుడ్ -అనిపించుకునే దిశగా పరుగులు పెడుతోంది.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను - లూకా 2:14.
క్రీస్తు జననములో ముందుగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగింది. కారణం ఆయన తెచ్చిన సమాధానమును బట్టి. క్రీస్తు జన్మము వలన దేవునికి మహిమ ఆయన కిష్టులుగా ఉన్నవారికి సమాధానము.
నవ నాగరికత వికసిస్తోంది.. సాంకేతికత విస్తరిస్తోంది.. ప్రపంచమే ‘పుడమి పల్లె’గా అవతరించింది.. ఆహారోత్పత్తుల్లో అద్భుతాలు.. వైద్య పరిశోధనల్లో నవీన ఆవిష్కరణలు.. కృత్రిమ మేధ కొత్తపుంతలు.. ఇవన్నీ విశ్వజనులందరినీ ‘ఆహా..!’ అనిపిస్తున్నా- నేటి ఆధునిక యుగంలో అనేకానేక సమస్యలు ‘్భగోళం’పై ముప్పేట దాడి చేస్తున్నాయి..
ప్రపంచం మొత్తమీద సాయుధ పాటవంలో, ఆయుధ సంపత్తిలో భారత సైన్యం ముందుకు దూసుకుపోతోంది. విశ్వవ్యాప్తంగా చూస్తే అత్యంత నైపుణ్యం ఉన్న ఆర్మీని కలిగిన అతి కొద్ది దేశాల్లో మన దేశం ఒకటి. భారతీయ త్రివిధ దళాలు శత్రు దుర్బేధ్యమైనవి. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన పలు యుద్ధాలలో మాతృభూమి రక్షణకు పదాతి, వాయు, నౌకాదళ విభాగాలు ప్రదర్శించిన తెగువ నిరుపమానం.
పందళ దేశాన్ని పాలించే రాజశేఖరుడు సంతానం లేక తీవ్ర మానసిక క్షోభ పడుతుంటాడు. ఒకరోజు వేటకు వెళ్లిన రాజశేఖరుడు పంబా నదీ తీరంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఎక్కడి నుంచో పసిబిడ్డ ఏడ్చినట్టు వినిపించింది. ఆ ఏడుపుఎక్కడి నుంచి వచ్చిందో వెతకమని తన భటులను పంపిస్తాడు. ఒక పెద్దవృక్షం కింద పసిబాలుడు ఒంటరిగా కనిపించాడు. భటులు వెంటనే రాజుకు ఆ విషయాన్ని తెలిపారు.
భారతదేశం మరోసారి పరిణతిని ప్రదర్శించింది. శాంతియుతంగా ఉంటూ లౌకిక స్ఫూర్తిని చాటింది. అయోధ్యలోని మందిర్-మసీదు వివాదంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పును రాజకీయాలకు అతీతంగా హిందూ, ముస్లిం సంస్థలు స్వాగతించడమేగాక, ఎంతో ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాయి. మత సమైక్యతకు ప్రతీకలుగా మందిర్, మసీదు నిర్మాణాలు నిలవనున్నాయి.
ఢిల్లీ ‘కనిపించడం లేదు..’! అవును.. దట్టంగా అలముకున్న కాలుష్యం పొగలో దేశ రాజధాని నగరం నిజంగానే ‘కనిపించడం లేదు..’! రహదారులపై నాలుగైదు అడుగుల దూరంలో ఏముందో మన కళ్లకు అగుపించని పరిస్థితి.. పొగల సెగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఈ మహానగరంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించాల్సిన దుస్థితి.. ‘గాలి నాణ్యత సూచీ’ (ఏక్యూఐ) దారుణంగా మారడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం..