S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

06/15/2019 - 17:46

అదో కుగ్రామం. అందులో వృద్ధ దంపతులు. వారికొక్కడే కొడుకు. నిద్రాహారాలు మాని, వాణ్ణి ప్రయోజకుణ్ణి చేయాలనే యావ కొద్దీ, కడుపు కట్టుకుని, బాగా ఉన్నత చదువులు చదివించారు. యుక్త వయస్సు వచ్చింది. ఉద్యోగమొచ్చింది. కానీ తల్లిదండ్రుల శరీరాలు చిక్కి శల్యమయ్యాయి. బొమికలు కాస్తా గూడుగా మారాయి. ప్రయోజకుడైన కొడుకు ఈ ఇద్దరినీ వదిలేసి ఎక్కడో పరాయి దేశం వెళ్లిపోయాడు. ఇంట్లో వృద్ధ దంపతుల్ని పలుకరించే వాళ్లు లేరు.

06/08/2019 - 19:28

కాశీయాత్రకు వెళ్ళేవారు అక్కడ తమకు బాగా ప్రీతిపాత్రమైన వస్తువును వదిలేసిరావడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వాళ్ళకు ఇష్టపడి తినే ఆకుకూరలు, దుంపకూరలు, తీపి పదార్థాలు వగైరా పేరు చెప్పి మళ్లీ వాటిని జన్మలో ముట్టుకోరు.
ఓరోజు మాకు తెలిసినామె ఒకరు కాశీనుంచి రాగానే, కాశీ గంగ చెంబులు చేతికిస్తోంటే, ‘‘కుతూహలంగా కాశీలో ఏం వదిలేసి వచ్చారని’’ అడిగా. వెంటనే నవ్వుతూ ‘బంగారం’ అంది.

06/03/2019 - 22:08

కాస్తో కూస్తో నాలుగు మాటలల్లడం తెలిసినంత మాత్రాన అందరూ కవులవ్వరు. కాస్త ముఖానికి మేకప్ చేసినంత మాత్రాన అంతా హీరోలవ్వరు. నాలుగు రాగాల పేర్లు తెలిసినంత మాత్రాన, అందరూ కమ్మగా పాడలేరు. శ్రద్ధగా ఎంతకాలం సంగీతం నేర్చినా విద్వాంసులవ్వాలనే నియమం లేదు.
సమయం, సందర్భం అన్నీ కలిసి రావటంతోబాటు, దైవ బలం కూడా వుండాలి.

05/25/2019 - 18:57

ఉత్తమ సంగీత సంప్రదాయ సంగీత ప్రమాణాలకు సాహిత్య విలువలకు ఆకాశవాణియే కొలమానంగా భావించే రోజుల్లో జరిగిన సంఘటనలు, తీపి జ్ఞాపకాలు ఎప్పుడూ మరువలేను. ప్రజలతో సంబంధం కలిగిన ప్రసార మాధ్యమాలకూ, ఇతర సంస్థలకూ తేడా ఎప్పుడూ వుంటుంది.

05/18/2019 - 20:14

మదన మనోహర సుందర నారీ,
మధుర దరస్మిత నయన చకోరీ,
మందగమన జిత రాజ మరాళీ
నాట్య మయూరీ
అనార్కలీ! అనార్కలీ! అనార్కలీ’
మూడు స్థాయిల్లో శ్రుతి పక్వమైన నాదాన్ని నింపుకుని ‘శుద్ధ హిందోళ’ రాగంలో సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్రావు గళంలో సాకీగా పాడిన మాటలు మీకు తెలుసు.
‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా’ పాట మొదలవుతుంది.

05/11/2019 - 19:23

పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం చేసినప్పుడల్లా ఆయా దేవతలపై ప్రముఖ వాగ్గేయకారులు అజరామరమైన కీర్తనలు ఒకటో రెండో గర్భగుడిలో ఓ ప్రక్కగా నిలబడి పాడుకుని బయటకు రావటం నాకో అలవాటు. సుందర శిల్ప కళతో విరాజిల్లే దక్షిణాదిలోని దేవాలయాల్లో బాగా పురాతనమైనవీ, ఎతె్తైనవీ, ఎంతో విశాలమైనవీ ఉన్నాయి.

05/04/2019 - 18:56

పడవ నడపవోయ్
పూల పడవ నడపోయ్
ఎత్తుగ తెరచాప నెత్తి
గట్టిగ చుక్కాని పట్టి!
ఒరగనీక సురగనీక తరగలపై తేలిపోవ॥
ఎప్పుడో ఐదారు దశాబ్దాల నాటి ఆకాశవాణి రికార్డులలో పి.బి.శ్రీనివాస్ పాడిన చక్కని పాట.
రేడియో బాగా బతికిన నాటి రోజులలో ట్రాన్స్‌స్క్రిప్షన్ సర్వీస్ రికార్డ్‌గా ఆ రోజుల్లో తరచు ప్రసారమై శ్రోతలకు గుర్తుండి పోయిన పాట.

04/27/2019 - 20:09

పాడాలనే ఉత్సాహముండి సంగీతం నేర్చుకోవాలనే వారికి లభించవలసినది మొట్టమొదట సద్గురువు. గురువు సమర్థత నేర్చుకునే శిష్యుడు గ్రహించటం కష్టసాధ్యమైన విషయం. సర్వ సమర్థుడని తెలిసేదెలా? ప్రతిభా విశేషాలున్న వారి గానమే సాక్ష్యం. నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి పుణ్యమా యని సంగీత కచేరీలు వినే అలవాటు సంక్రమించింది. నాకు గుర్తున్నవి మీతో పంచుకోవాలని పించటమే ‘అమృతవర్షిణి’కి ప్రేరణ.

04/20/2019 - 19:27

‘ఏమిటి? అలమేలుకు సంగీతమా? మీకేమైనా మతిపోయిందా? మన పరువు ప్రతిష్టలేం కానూ? సంగీతం లేదూ కాకరకాయా లేదు. నోరు మూసుకుని పడుండండి’ ఇంట్లోంచి తల్లి సతాయింపు మాటలతో కృష్ణస్వామికి నోట మాట లేదు. ఆయనకు సంగీతమే ప్రాణం. కూతురు పాడుతూంటే ఆయన ఆనందానికి అవధులుండవు. పైగా ఊళ్లో నైనాపిళ్లెతో ఆ వేళే మాట్లాడి వచ్చాడు. నైనా పిళ్లె లాంటి మహా విద్వాంసుడు అలమేలుకు సంగీతం నేర్పుతానంటే అంతకంటే కావలసినదేముంది?

04/13/2019 - 19:05

నన్నయకు ముందు ఆంధ్ర సారస్వతం, వాల్మీకికి ముందు సంస్కృత సాహిత్యం ఎలా వుండి వుండేదో? పండితులు ఊహించి కొంత వరకూ చెప్పగలరు. త్యాగబ్రహ్మ నాదస్వరూపుడై ఆవిర్భవించక ముందు సంగీతం ఉంది. కానీ ఆ సంగీతానికి పూర్తి వికాసం లేదనే అంటారు. సంగీత సామ్రాజ్యంలో శిఖర సమాజనుడు త్యాగయ్య. మనం పాడవలసిన సంగీతానికి సంప్రదాయాన్ని చూపించాడు. సరళమైన సాహిత్యాన్ని ఉన్నతమైన సంగీత స్థాయికి తీసుకుపోయాడు.

Pages