S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమృత వర్షిణి
ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములన్న త్యాగరాజు
‘విదులకు మొక్కెద సంగీత
కోవిదులకు మ్రొక్కెద’ అనే కీర్తనలో దివ్యమైన సంగీతాన్ని ఆలంబనగా చేసుకున్న వారందర్నీ తలుచుకుని నమస్కరించాడు.
విదులు అంటే పండితులు, కోవిదులు అంటే ఇంకా పెద్ద పండితులు, సమర్థులైన విద్వాంసులు.
కాలదండ పరిపీడిత జానుం
కామితార్థ ఫలద కామధేనుమ్॥
కాలచక్ర భేద చిత్రభానుమ్॥
కల్పిత ఛాయాదేవి సూనుమ్॥
శనీశ్వరుడిపై దీక్షితుల వారి కృతిలోని చరణం ఇది. సంగీత మూర్తి త్రయంలో ముఖ్యుడు ముద్దుస్వామి దీక్షితులు. గురుగ్రహ దోషం వల్ల తన శిష్యుడు శూలనెప్పితో బాధపడుతూంటే చూడలేక ‘బృహస్పతే తారాపతే’ అనే కృతి 40 రోజులు పాడుకోమనగానే ఆ నెప్పి తొలగిపోయి ఆరోగ్యవంతుడయ్యాడు.
మన భారతీయ రైల్వే ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థల్లో ప్రముఖమైనది. ప్లాట్‌ఫారమ్‌లు శుభ్రం చేసే వారి మొదలుకుని వేలాది మైళ్లు ప్రయాణం చేసే రైళ్లను ఒక పద్ధతిలో నడిపిస్తూ పర్యవేక్షించే అత్యుత్తమ అధికారి వరకూ ఓ జవాబుదారీ తనముంటుంది. ఎనె్నన్ని శాఖలో? ఎంతమంది ఉద్యోగులో? ఉదాహరణకు ప్రయాణీకులను చేరవేసే రైళ్లకు కనీసం 15,20 బోగీలకు తక్కువ ఉండవు. ఒక్కో బోగీలో, 70కి పైగా ప్రయాణీకులుంటారు.
హాయిగా నవ్వటం లేదా నవ్వించటం ఒక యోగం. ఈ రెండూ లేకపోతే అదో రోగం అన్నాడు జంధ్యాల.
అష్ట దిగ్గజాలను ప్రస్తావిస్తే, శ్రీకృష్ణ దేవరాయల్ని వెంటనే తలుచుకుంటాం. ఈ అష్టదిగ్గజాలెవరన్న విషయంలో అభిప్రాయ భేదాలున్నా, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయగారి మల్లన్న, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడు (్భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు, తెలుగు సాహిత్య పాఠకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కవులుగా, అష్టదిగ్గజాలు గానే ప్రఖ్యాతి పొందారు.
ఉ.అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి రుూవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
పాడాలనే కోరిక లేని మనిషంటూ సాధారణంగా ఉండరు. కనీసం వినాలనే ఆసకె్తైనా ఉంటుంది.
అప్పుడైనా పాడాలనిపించటం సహజం. అనురక్తి, అభిలాష, ఆసక్తి కలిగిన కొందరు నియమబద్ధంగా నిష్టతో ఓ గురువు నాశ్రయించి పట్టుదలతో సాధన చేస్తారు.
అసలు ఏ కృషి చేయకుండా, నలుగురినీ విని పాడగలిగేవారుంటారు.
అందంగా, చూడముచ్చటగా అలంకరించిన సభాప్రాంగణం... విద్యుద్దీపాల కాంతితో శోభాయమానంగా తీర్చిదిద్దిన వేదిక ఆ వేదికపై నాదానుభవం పండిన సంగీత విద్వాంసులు. వారి వెనుక శృతి చేసిన తంబురా స్వయం భూధ్వనుల ఆహ్లాదకర సంగీత వాతావరణంలో సుస్వర సునాద సంగీత ధారామృతం గ్రోలడానికి సిద్ధమై కూర్చున్న రసిక జనం. మొదటి రెండు వరుసలలోనూ ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన అతిథులు.
నేను ప్రవృత్తిరీత్యా కవినీగాను, పెద్ద రచయితనూ గాను. రేడియోలో పనిచేసే కాలంలో నాకు తెలిసిన రాగాలను గురించి పాటలను గురించీ కొనే్నళ్లపాటు ‘రాగరంజని’ ‘రాగరాగిణి’ పేర్లతో ప్రతి వారం ఓ అరగంటసేపు కార్యక్రమాలు సమర్పించేవాణ్ణి. అది కొన్ని దశాబ్దాలపాటు సాగింది. సంగీతం మీద వున్న మక్కువ కొద్దీ కష్టమైనా, ఇష్టపడి చేసేవాణ్ణి.
సీ॥ కమనీయ భూమి భాగములు లేకున్నవే
పడియుండుటకు దూది పఱుపులేల?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే
భోజన భాజన పుంజమేల?
వల్క లాజిన కుశావళులు లేకున్నవే
కట్ట దుకూల సంఘాతమేల?
గొనకొని వసియింప గుహలు లేకున్నవే?
ప్రాసాద సౌధాది పటలమేల?