S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

08/24/2019 - 18:27

తాడేపల్లి వీర రాఘవ నారాయణశాస్ర్తీగారు చాలా గొప్ప దైవీ ఉపాసకుడని ప్రసిద్ధి. సాక్షాత్ బాలాంబిక (అమ్మవారు) ఆయనపూజా గృహంలోనే తిరుగుతూ కనిపించేదట. మాట్లాడేదట. అంతటి తపశ్శక్తి ఆయనది. సంగీతోపాసన కూడా అంతే. నాదోపాసకులంతా అలాగే జీవించారు. కాలక్షేపం కోసం ఊరికే కూర్చుని పాడే ఆటలకూ, ఉపాసనకూ చాలా తేడా ఉంది.

08/17/2019 - 19:01

ఏమని మాట్లాడితివో? రామ
ఎవరి మనసుకే విధమో తెలిసి ॥

మామ, మరదులనుజులు తలిదండ్రులు
భామలు పరిజనులు స్వవశక్రాట ॥

రాజులు, మునులు, సురాసురులు, వరది
గ్రాజులు మరి సూరులు శశధర దిన
రాజులు లోబడి నడుదను త్యాగరాజ వినుత
నయముగ, భయముగ, ముద్దుగ ॥

08/10/2019 - 17:53

ఆలిండియా రేడియోలో దేశభక్తి గీతాలెన్నో పాడాను. పాడించాను. దేశభక్తి గేయాలంటూ ఎవరు రాసినా ఒక్కటే కథా వస్తువు.
చెప్పినదే పదిసార్లు చెప్తారు. అంటే.. మన భౌగోళిక సంపద, చుట్టూ ఉన్న జీవనదులు, ఎతె్తైన పర్వతాలు, గుహలు ప్రాచీనులు కట్టేసి వెళ్లిపోయి ఆనవాళ్లుగా మిగిల్చిన గుళ్లూ గోపురాలు, శిల్పాలు.. శాశ్వత కట్టడాలు.. ఇవే.

08/03/2019 - 18:51

అంతరిక్షంలో, ఎక్కడో ఏ లోకాల్లోనో కొలువైయున్న పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునే ఒకే ఒక మార్గం.. హాయిగా గొంతెత్తి కీర్తిస్తూ గానం చేయటమే. మరే దగ్గరదారులూ పనిచేయవు. అందుకే భక్తాగ్రేసరులంతా ఈ మార్గానే్న ఎంచుకున్నారు. దీనికి ఆర్ద్రత కావాలి. భావనాబలం, భాషా సౌలభ్యం.. రెండూ పెనవేసుకుని దర్శనమివ్వాలి. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా వున్న కవులను ఆశ్రయించిన గాయకులు వారి ప్రతిభకు పట్టం కట్టారు.

07/27/2019 - 18:43

మంచీ, చెడూ, కష్టం సుఖం, లాభం, నష్టం, సుఖం దుఃఖం, ధర్మం అధర్మం, నీతి అవినీతి- ఇలా ద్వంద్వాలతోనే జీవితమైపోతుంది. ఎవ్వరికీ కలకాలం ఏ ఒక్కటీ నిలకడగా నిలవదు. అదే విచిత్రం. ఈ జంటల్లో ఏ ఒక్కదాని యొక్క పర్యవసానం తెలిసినా చాలు. మనిషికి సుఖ సంతోషాలు రెండూ లభిస్తాయి. కానీ మాయామోహం కదా? తెలుసుకోనివ్వదు. బుద్ధిపుట్టనివ్వదు.

07/20/2019 - 18:46

మనసుకు ప్రతిరూపమే మనిషి. స్థూల రూపంలో కనపడేది మనిషి. కనిపించనిది మనసు.
రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలు పుట్టి పెరుగుతూ, తరుగుతూ ఎలా ఉంటాయో మనసులో పుట్టే సంకల్ప వికల్పాలూ అంతే. ఏ కారణమూ కనిపించదు. కొందర్ని చూస్తే పెట్టబుద్ధి మరి కొందరు కనిపిస్తే తిట్ట బుద్ధి.

07/13/2019 - 19:50

గాయకులెందరో వుంటారు. కానీ గొంతులో సుస్వరం కొందరి మాత్రమే లభించే వరం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో, కొద్దిమంది మంచి శారీరం కలిగిన నేపథ్య గాయకులకు సంగీత నేపథ్యం మరో వరం.
అపారమైన సంగీత జ్ఞానమున్నా లేకపోయినా కంఠస్వరంలో మాధుర్యం లోపిస్తే ఎక్కువ కాలం ఈ రంగంలో నిలదొక్కుకోలేరు.
ఉత్తరాది హిందీ చలనచిత్ర సంగీతమంతా హిందూస్థానీ సంగీత బాణీ ప్రధానంగానే వినిపిస్తుంది.

07/06/2019 - 18:45

గానవిద్య యోగవిద్య లాంటిది. తేడా ఏమంటే యోగికి బ్రహ్మ సాక్షాత్కారం కోసం మాత్రమే ఆ విద్య ఉపయోగపడుతుంది. కానీ సంగీతం కేవలం గాయకుణ్ణే కాదు, వినే శ్రోతను కూడా ఉద్ధరిస్తుంది. గమ్మత్తేమంటే విద్వాంసుడు చేసే సాధన కూర్చుని వినే శ్రోత చెయ్యడు. అవసరం లేదు. లోకంలో లౌకికమైన విద్యలెన్నో ఉన్నాయి. శిల్పం, కవిత్వం, నృత్యం, చిత్రలేఖనం లాంటివన్నీ ప్రజ్ఞలు అందరికీ అలవడవు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి.

06/29/2019 - 18:03

లోకంలో ఏ మనిషికైనా కావలసినది సుఖం, ఆనందం. ఎండమావుల వెంట లేడిపిల్లలా, పరుగెత్తినా తిరిగీ తిరిగీ విసిగి వేసారటమే తప్ప ఎప్పుడూ ఆనందమనేది ఆమడ దూరంలోనే ఉంటుంది.

06/22/2019 - 18:36

ఒకనాటి సంగతి... ‘యే ఆకాశ్‌వాణీకా పంచరంగీ ప్రోగ్రామ్ హై వివిధ్‌భారతి అబ్ హమారీ కర్ణాటక్ సంగీత్ సభా షురూ హోతీహై’ అనే అనౌన్స్‌మెంట్ వివిధభారతి కేంద్రాల నుండి మధ్యాహ్నం 3.45 ని. నుంచి 5.30 వరకూ ఊరూ వాడా రేడియోల్లో మారుమోగేది.

Pages