అమృత వర్షిణి

వాగ్భూషణం.. భూషణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమని మాట్లాడితివో? రామ
ఎవరి మనసుకే విధమో తెలిసి ॥

మామ, మరదులనుజులు తలిదండ్రులు
భామలు పరిజనులు స్వవశక్రాట ॥

రాజులు, మునులు, సురాసురులు, వరది
గ్రాజులు మరి సూరులు శశధర దిన
రాజులు లోబడి నడుదను త్యాగరాజ వినుత
నయముగ, భయముగ, ముద్దుగ ॥

మాటల చేత దేవతలు మన్నన చేశి వరంబులిత్తురు
మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిత్తురు
మాట నేర్వకున్న అవమానము, మానభంగము
ఏదేదో మాట్లాడతారు. కాదు. ఏది మాట్లాడాలో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు కొందరు. ఏ మాటైనా అది ప్రేమపూర్వకంగా ఉంటూ మనసు రంజిల్లచేయాలి. ఒక మాటకు లొంగిపోతాడు. అవతలి వాడు దుర్మార్గుడైనా సరే ఇదే మంత్రం.
నా అంతట వాడు లేడనటం కాదు. నీ అంతటి వాడున్నాడా లోకంలో? అని చూడండి. ఇంక మీ దారి రహదారే.
దీనికి పైసా పెట్టుబడి అక్కర్లేదు. దీనికే లోపం - పైకి ముఖం చిట్లించుకుని తిరిగినా ఆయన మనసు వెన్న అంటే ఏమిటి సుఖం? ఒంటికి నగా నట్రా అలంకరించుకుని మురిసిపోతూ, మాటలో మృదుత్వం లేకపోతే బూడిదలో పోసిన నీరే. ఆ మనిషికి గౌరవముంటుందా?
శ్రీరామాయణంలో రాముణ్ణి మర్యాదా పురుషోత్తముడంటారు. ఎవరెవరితో ఎలా మాట్లాడాలో తెలిసినవాడని ప్రతీతి.
శ్రీరామాయణంలో ఆది నుంచి అంతా అయ్యేంతవరకూ వివిధ రకాల మనస్తత్వాల మనుషులతో ఆయన మాట్లాడిన తీరును ‘త్యాగయ్య’ ఈ కీర్తనలో విశే్లషిస్తారు. కిష్కింధకాండలో హనుమంతుణ్ణి పలకరించిన రాముడికి -హనుమంతుడి మాటల్లో మొత్తం హనుమంతుడి వ్యక్తిత్వాన్ని లక్ష్మణుడికి చెప్పేస్తాడు. పెద్ద మనిషిగా గౌరవిస్తాడు. చంచలమైన స్వభావం గల మొత్తం వానర జాతిలో అత్యుత్తముడిగా హనుమను శ్లాఘిస్తాడు. సీతానే్వషణ భారాన్ని ఆయన భుజస్కంధాలపై పెట్టడమే ఇందుకు సాక్ష్యం. మామగారైన జనకుడు, మరుదులు, తమ్ముళ్లు, తన తలిదండ్రులు, ముఖ్యంగా తను వనవాసం చేయటానికి కారణమైన కైకతో సైతం ఎంతో మృదువుగా మాట్లాడినట్లు వర్ణిస్తాడు త్యాగయ్య. శ్రీరాముడు ఎదుటి వారి మనస్సు రంజిల్లే విధంగా మాట్లాడగల కళ బాగా తెలిసిన వాడంటాడు! విభీషణుడు శత్రు పక్షంలో ఉన్నాడు. ముందూ వెనుక చూడకుండా వధించమని సుగ్రీవుడు రాముడితో అంటే ‘సుగ్రీవా? మైత్రికి ఓ ధర్మం ఉంది. కట్టుబాట్లున్నాయి. లంకం రాజ్యంలో ఉండలేక, అధర్మాన్ని నిలువరించలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో నన్ను ఆశ్రయించాడు. నేనున్నానని అభయమిచ్చాను. చంపమంటావా? శరణాగత త్రాణ బిరుదాంకితుడైన శ్రీరామచంద్రుడి వెంట వస్తూన్న మాటలు వింటున్న సుగ్రీవుడికి ఆశ్చర్యమేసింది.
ఆ మాటల వెనుక శ్రీరామచంద్రుడిలో ఘనీభవించుకున్న కరుణారసమెంత గొప్పదో ఆ క్షణంలో గ్రహించగలిగాడు.
అయోధ్యను వదిలేసి వనవాసానికి బయలుదేరిన సీతాలక్ష్మణ సహితుడైన రామచంద్రుణ్ణి వదిలి ఉండలేక, అయోధ్య ప్రజలు విషణ్ణ వదనాలతో, ఏడుస్తూ వెంటబడిన కారణం ప్రేమయే.
ఎన్నిటినైనా కలిపేసేది ప్రేమ ఒక్కటే. అది ఆర్ద్రంగానే వ్యక్తమవ్వాలి. అకారణంగానే పుట్టుకురావాలి. హృదయాన్ని కరిగించాలి.
త్రేతాయుగం నాటి ప్రేమబంధాలు కలియుగంలో మనుషులకెందుకుంటాయి?
తన వాక్కును ఉదాత్త స్థితిలో నిలిపి మనసు విప్పి మర్మం లేకుండా పాడుకున్న త్యాగయ్యకు శ్రీరామచంద్రుడు ప్రేమమూర్తిలా కనిపించాడు. ఉద్వేగంతో, ఆర్ద్రమైన భావాలతో నిలిచి ప్రార్థించాడు. ‘మా అమ్మ సీతమ్మ. శ్రీరాముడే నాకు తండ్రి’ అంటూ ఆ వసుధైక కుటుంబంలో తను కూడా ఒకడిగా భావించాడు. అంతటితో ఆగలేదు. హనుమంతుడు, లక్ష్మణుడు, గరుత్మంతుడు, శత్రుఘు్నడు, జాంబవంతుడు, భరతుడు మొదలైన వారంతా తన సోదరులని భావించాడు. ఆ మాటకొస్తే లోకంలో భాగవత శ్రేష్టులంతా తనవాళ్లే అన్నాడు. ఇదీ ప్రేమకు పరాకాష్ట.
* * *
సుఖ దుఃఖాల్ని ప్రతిబింబించేవి నవ్వూ, దుఃఖం. ఈ రెండూ మనిషికి మాత్రమే సహజంగా పుట్టుకొచ్చే లక్షణాలు. తెచ్చిపెట్టుకునేవి కావు. కొనుక్కుని తెచ్చుకునేవీ కావు. పశు పక్ష్యాదులకసలు తెలియదు. తెలిసినా వ్యక్తపరచుకోలేవు.
భగవాన్ రమణుల ఆశ్రమంలో తిరిగిన జంతుజాలంతో ఆయనకెంత సంబంధముండేదో ఆయన చరిత్ర చదివిన వారందరికీ తెలుసు.
అరుణాచలంలోని ఆశ్రమంలో ఆయన చుట్టూ తిరిగిన పశువులూ, పక్షులూ దీనికి సాక్ష్యం. నోరులేని ఆ జీవాలతో భగవాన్ సంభాషించేవారు. ప్రేమగా పిలుస్తూండేవారు. వాటికి కోపం వచ్చిన సందర్భాలూ ఉండేవి. వాటికి కొన్ని సంకేతాలుండేవి. ఆ సంకేతాలకు భగవాన్ అర్థం కూడా చెప్పేవారట.
ఆయన ప్రేమామృత ధారలలో తడిసి ముద్దైన పశుపక్ష్యాదులు ఆయన్ని వదల్లేక, వెళ్లలేక ఆయన పాదాల దగ్గరే కన్నుమూసిన సందర్భాలున్నాయి. భగవాన్ ప్రేమకు సాక్ష్యంగా ఆశ్రమంలో నిర్మించబడిన సమాధులే ఇందుకు సాక్ష్యం. సర్పం చూడండి. చూడగానే కంగారుపడిపోయే మనిషి కంట పడకుంటే చాలనుకుంటుందట. ప్రేమాభిమానాలు లేకుండా ఈ లోకంలో ఎవరైనా జీవించగలరా చెప్పండి. అన్నీ ధనంతోనే సిద్ధిస్తాయా? వైద్యం కోసం తపిస్తూ ఏదో నేరం చేసిన వ్యక్తుల్లా నిలబడే రోగులను చిరునవ్వుతో డాక్టర్లు పలకరిస్తే చాలు. సగం రోగం తగ్గుతుంది. ఆందోళన కనపడదు. ఆవేదన ఉండదు. హాస్పిటల్స్‌లో పొరబాటున ఏ డాక్టరైనా పేషెంటుతో మాట్లాడుతూ నవ్వుతూ కనిపిస్తే ‘వైద్యో నారాయణో హరిః’ అని ఒక్కసారి పాదాభివందనం చేయాలనిపిస్తుంది. కానీ ఆ అవకాశం వారివ్వరు. అదేమి చిత్రమో అస్సలు నవ్వరు. అదే తమాషా. ‘మీ దగ్గరకు ఆర్తిగా వచ్చే రోగులతో ప్రసన్న ముఖాలతో నవ్వుతూ మాట్లాడి వారికి ధైర్యవచనాలు చెప్పటం మరచిపోవద్దని హెచ్చరిక చేసి మరీ డాక్టర్లకు డిగ్రీలిచ్చి పంపిస్తారు. కొఱకొఱలాడే కళాకాంతీ లేని ముఖాలతో చిర్రుబుర్రులాడే కొందరు వైద్య శిఖామణులు కొత్త రోగాలు తెచ్చిపెడతారేమో గానీ ఉన్న రోగాన్ని గమనించరు. రోగిని మనిషిగా చూడరు. అదే విచిత్రం. భావ దారిద్య్రం కాకపోతే ‘ఎలా ఉన్నారు?’ అంటే వారి సొమ్మేం పోతుంది?
రాజమండ్రిలో శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తీగారనే గొప్ప పేరున్న ఆయుర్వేద వైద్యులుండేవారు.
పేదల పాలిట పెన్నిధిగా ఆయన్ని తలుచుకునేవారట.
నలుగురు మనుషుల్ని పెట్టి ఏవేవో చూర్ణాలు, లేహ్యాలూ, మాత్రలూ ఇంట్లోనే తయారుచేయిస్తూంటే ఒక పెద్ద మనిషి అడిగాడట. ‘ఎందుకీ శ్రమ డాక్టర్‌గారూ? వచ్చిన ఆ పేషెంట్లు కొనుక్కోలేరా?’ అంటే.. డాక్టర్‌గారి సమాధానం!
‘అందుకే గదా ఈ శ్రమ? అందరికీ మందులు కొనే స్తోమత ఉంటుందా చెప్పండి? ఈ సహాయమేపాటిది?’ అని నవ్వేసి ఊరుకునేవారట.
నాడి చూసి రోగాన్ని నయం చేయగల మేధావులుండేవారు. రోగాన్ని నివారించగలిగామన్న తృప్తే కానీ కాసుల కక్కూర్తి.
డాక్టరిచ్చే మందులు కంటే రోగితో మాట్లాడే మాటలే ఔషధంలా పనిచేసే రోజులెప్పుడో పోయాయి. రోగం వస్తే ఏదో నేరం చేసిన దానితో సమానం డాక్టర్లకు.
నేను విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేసే రోజుల్లో చాలామంది డాక్టర్లు వస్తూండేవారు. డాక్టర్‌తో ‘ముఖాముఖి’ ఇప్పుడూ ఉంది. నూటికి ఎనభై మంది స్టూడియోలోకి రాగానే బిగుసుకుపోయి భయం భయంగా మాట్లాడేవారే ఎక్కువ. ఎంతో అసహజంగానే ఉండేది. ఇది నా స్వానుభవం.
రోగులతో స్వేచ్ఛగా ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ‘మీకేం ఫరవాలేదు. మేమున్నాం కదా? అనే ధైర్యవచనాలు చెప్పే అలవాటుంటేగా?’

- మల్లాది సూరిబాబు 90527 65490