S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

03/02/2019 - 19:02

శృతితో పాడటం వేరు. శృతిలోనే మునిగి పాడటం వేరు. తేడా వుంది.

02/23/2019 - 19:36

సంగీతంలో పైకి కనిపించని గుణమొకటుంది. ఏ మాత్రం కాస్త పాడగలిగే వారికైనా వారి పాట మీద వారికెంతో భయంకర నమ్మకం.

02/16/2019 - 18:46

లోకంలో దైవదత్తంగా లభించిన సంగీత విద్య నభ్యసించిన కొందరు సంగీత విద్వాంసులు తమకు తాము చాలా గొప్పవారమనే స్వోత్కర్షతో బ్రతుకుతూ పటాటోపాన్ని ప్రదర్శిస్తూంటారు. అవతలి వారిలో వున్న కాస్త గొప్పతనాన్ని కొండంతలుగా చేసి, ఆ మహా విద్వాంసుల ముందు ‘మేమెంత’ అనే అణకువ భావంతో తమ గొప్పతనాన్ని కాసె్తైనా బయటకు ప్రదర్శించని మహా విద్వాంసులు బహు అరుదు.

02/09/2019 - 19:01

వెనుకటి రోజుల్లో ఆంధ్రులంటే అసహాయ శూరులని కొందరూ, కాదు, ఆరంభశూరులని మరి కొందరూ అంటే వినీ విననట్లుగా ఉండేవాళ్లం.

02/02/2019 - 17:40

‘అబ్బా! సెక్రటరీ! ఎప్పుడూ పనులూ, బిజినెస్సేనా? పరగడుపునే కాస్తంత పచ్చిగాలి పీల్చి ఆ ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ?
- ఔనండి!
ఔనంటూ తలూపడం కాదు. (ఆకాశం వైపు చూస్తో) కళ్లట్టుకు చూడు. పైనేదో మర్డర్ జరిగినట్లు లేదూ? ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ?
- అద్భుతం సార్!

01/28/2019 - 22:32

‘మమతన్ మోములు మీదికెత్తుకొని
రోమంథంబు చాలించి హృ
త్కమలాగ్రంబులఁ గృష్ణు నిల్పి
మురళీ గానామృత శ్రేణి క
ర్ణములంఁ గ్రోలుచు మేతఁ మాని
గళితానందాశ్రులై చిత్రి తో
పతులై గోవులు చూచుచున్నవవిగో
పద్మాక్షీ! వీక్షించితే?
బాగా గమనిస్తే అర్థం కాని మాటలేమీ ఇందులో లేవు.

01/19/2019 - 19:28

ఎప్పుడో 50 ఏళ్ల నాటి మాట. ఆకాశవాణికి ‘వాణి’ అనే పత్రిక వుండేది. అందులో ఉద్యోగ ప్రకటన చూసిన ఓ యువకుడు తిన్నగా అప్పటి డైరెక్టరయిన డా.బాలాంత్రపు రజనీకాంతరావును కలుసుకుని దరఖాస్తు చేతికిస్తోంటే, మీ తండ్రి చంద్రశేఖర శాస్ర్తీగారెలా వున్నారు? అని కుశల ప్రశ్నలు వేసి, ఆ యువకుని వైపు చూసి ‘అయినా ఈ ఉద్యోగాలు నీకెందుకయ్యా? మంచి సంగీత నాటిక ఒకటి రాసివ్వరాదూ?

01/12/2019 - 18:50

ఎంత నేర్పు తోడ నేమేమి చదివినఁ
జింతలేని విద్య చిక్కఁబోదు
పంతగించి మదిని పరికించి చూడరా!
విశ్వదాభిరామ వినురవేమ!

01/05/2019 - 19:45

‘ఎంచగ భూమియొక్కటే ఏలిన రాజులెందరో’ అంటాడు అన్నమయ్య.
పంచభూతాలకేలాటి మార్పూ వుండదు. ఈ భూమ్యాకాశాలకు లేదు మార్పు - వున్న తేడా అంతా మనిషికే. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధన’ అన్నారు.
గొప్పగొప్ప వాళ్లంతా కూడా ఉత్క్రమణానికి బాధపడలలేదు. దానికి బదులు ధర్మసాధనమైన శరీరం లేకుండా పోతోందే అని తపించారట. కాలస్య కుటిలా గతిః అంటాడు వాల్మీకి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కాలం మారిపోతుంది.

12/29/2018 - 23:14

జీవనది ఎప్పుడూ ఎండిపోదు. సంగీత ప్రవాహం ఎప్పుడూ నిండుకోదు. అందులో ఎవరు మునిగినా ధన్యులే. స్నానం చేసే ఓపిక లేనివారు చెంబుతో కాసిన్ని నీళ్లు చల్లుకున్నా సంగీత గంగ అనుగ్రహిస్తుంది. ఈదడం తెలిసినవారు నది మధ్యకు వెళ్లి పరమ తృప్తిగా స్నానం చేసినట్లుగా, సంగీతపు లోతుల్ని చూసి పరవశించి గానం చేస్తూ నాదమయ లోకాల్లో విహరించగలిగిన గాన గంధర్వులెందరో ఈ భూమీద పుట్టారు. పాడేశారు, వెళ్లిపోయారు.

Pages