అమృత వర్షిణి

మూల విరాట్టు - ఉత్సవ మూర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీతంలో పైకి కనిపించని గుణమొకటుంది. ఏ మాత్రం కాస్త పాడగలిగే వారికైనా వారి పాట మీద వారికెంతో భయంకర నమ్మకం.
నేను 1970లో ఆలిండియా రేడియోలో చేరిన తర్వాత నాకంటే ఎన్నో వేల రెట్లు గొప్పవారైన సంగీత విద్వాంసులున్నారని తెలిసొచ్చింది. అంతే! నా ఆలోచనా విధానంలోనే మార్పు కలిగింది. నా పాట స్థాయి నాకు సరిపోలేదు. ఆ మహానుభావుల సంగీత స్థాయికి ఎదగగలనా? నేర్చుకునేందుకు అసలు నాకు అర్హతుందా? అద్భుతంగా పాడుతున్నావోయ్! అని ముఖస్తుతి చేసినా ‘నాయనా! రా! తప్పకుండా చెప్తాననే వారెవరైనా దొరుకుతారా?’ అని మధనపడిపోయేవాణ్ణి.
దేశవ్యాప్తంగా వివిధ భారతి కేంద్రాలు ప్రారంభించిన రోజులవి.
బొంబాయి కేంద్రంలో రికార్డైన పలు భాషల్లోని పాటలు ఎనౌన్సుమెంట్లతో సహా వందలాది టేపుల్లో ప్రతి ప్రధాన కేంద్రానికి వస్తూండేవి. ప్రసారమయిన వెంటనే తిరిగి యథాస్థానానికి కట్టలు కట్టి పంపేస్తూండేవారు. శాస్ర్తియం, హిందుస్థానీ సంగీతమే కాదు. ఒక రకమా? ఒక లోకమా? లలితం, లలిత శాస్ర్తియం సుగమ సంగీతం, విభిన్న ప్రాంతాల్లో పాడుకునే జానపద గీతాలన్నీ ‘సంచీ’ ఉదయం లగాయితూ రాత్రి వరకూ దులిపేసినట్లుగా ప్రసారమై పోతూండేవి. ఎన్నని గుర్తుంటాయి? సప్తస్వరాల రూపాలన్నీ రకరకాలుగా దర్శనమిస్తూండేవి. బుద్ధిగా కూర్చుని కదలకుండా -ఈ జన్మకు ఈ సంగీతం వినగలిగే యోగం కలిగింది. చాలు. వినగా వినగా ఏ జన్మకైనా సంగీత సిద్ధి కలగకపోదా అనుకునేవాణ్ణి.
ఓ రోజు మధ్యాహ్నం వివిధభారతిలో డ్యూటీ చేస్తూ నాకిష్టమైన పాట వింటూ, ఆ గాయకునితో గొంతు కలిపి పాడుతున్నాను. స్టూడియో తలుపులు వేస్తే బయటకు వినిపించే అవకాశం లేకపోయినా, ఆ వేళ నా పాట బయట డ్యూటీ రూమ్‌లో కూర్చుని వింటున్న నా గురువైన వోలేటి గారి చెవిన పడింది.
‘లోపలెవరు పాడేది?’ అని అక్కడున్న ఆఫీసర్‌ని అడిగి నన్ను పిలిచారు.
‘మీ గొంతు బాగుంది. సినిమా పాటల మీద వున్న శ్రద్ధ కాస్త సంగీతం మీద మళ్లిస్తే ఇంకా మంచిది. ఈ సినీ గానం సంగీతాన్ని పెరగనివ్వదు సుమా!’ అని హెచ్చరించి నాతోబాటు ఎన్‌సివి జగన్నాథాచార్యులు సంగీత శిక్షణలో కీర్తనలు నేర్చుకుంటున్నాడు. మీరూ ఆయన ప్రక్కనే కూర్చోండి. పాడే ప్రయత్నం చేయండన్నారు.
అందులోని విశేషం అప్పుడు అస్సలు తెలియదు. బుధ, శుక్రవారాల్లో ఉదయం 6 గంటలకు తిన్నగా స్టూడియోలో కూర్చుని తంబురా బాగా శృతి చేస్తూ సిద్ధంగా వుండేవాణ్ణి. ఆ తర్వాత కాసేపటికి జగన్నాథాచార్యులు లోపలకు వచ్చేవారు. వార్తాప్రసారం పూర్తవ్వగానే 7.15 ని.ల నుంచి 7.30 వరకూ ఆయన చెప్పే సంగీత శిక్షణలోని కీర్తనలన్నీ అనుస్వర సహితంగా అవసరమైన గమకాలతో చిక్కగా, బరువుగా పాడి వినిపిస్తూంటే రాగభావం కీర్తనలకు ఎలా అల్లుకుపోతుందో అద్భుతంగా మనసు కెక్కేది. అలా 200 నుంచి 250 కీర్తనలు నేర్చుకున్నా. ఇంట్లో సాధన చేసే అవసరముండేది కాదు.
అదీ ఆయన గొప్పతనం.
ఆ కార్యక్రమం మొత్తం విశాఖపట్నం, హైదరాబాద్, కడప కేంద్రాలన్నీ (రిలే) ప్రసారం చేసేవి.
అనుస్వరం, అసలు స్వరం కలిస్తే ఏర్పడే గమకం, ఎంతో ఒద్దికతో పాడి వినిపించేవారు. అక్కడే రాగభావాన్ని గుర్తించగలిగే స్వర స్థానం గుర్తు భలే తెలిసేది. అంతేకాదు. గమకాలతో పాడిన సంగతులు ఒక్కసారి నిలిపి ఆగేవారు. రేడియోలో బాగా ప్రసిద్ధమైన ఈ కార్యక్రమం పట్ల ఆయనకెంతో ప్రేమ. ఆయన కంఠం శృతిలో నిలబడటం కాదు. శృతి మాధుర్యమే ఆయన కంఠాన్ని ఆశ్రయించి కూర్చునేది. తమాషా ఏమిటంటే సంగీత శిక్షణ కార్యక్రమం ప్రారంభానికి ఒక పావుగంటసేపు పాడేదంతా ‘హిందుస్థానీ’ సంగతులే. పొరబాటున కర్ణాటక సంగీత గమకం ఒక్కటి పాడేవారు కాదు. అలా పాడటం ఆయనకో వేడుక. అలాగే ప్రాకుతూ గమనిస్తూ పాడే ప్రయత్నం చేసేవాణ్ణి. ఎనౌన్సుమెంటు రాగానే ‘్భరవి’ రాగం కీర్తన చాలా నిదానంగా, తాపీగా ప్రారంభించటం నేను మరచిపోలేని అనుభవం. అంతకు ముందు పాడిన హిందుస్థానీ రాగం ముక్కలన్నీ మాయమయ్యేవి. నచ్చితేనే వినండనే రీతిలోనే ఉండేది. ఆయన పాట వినేవారి స్థాయికి ఎప్పుడూ దిగిపోయి వుండేది కాదు. తన పాటను గురించి పొంగిపోవటం లేదు. ఇతరుల సంగీతం విమర్శించటం లేదు. ఇతర విద్వాంసుల పాటలోని సూక్ష్మాలన్నీ బాగా గ్రహించేవారు. ఆయనకు స్వరం మీద పూర్తి పట్టుండేది.
మధ్యాహ్న సమయాల్లో ‘రంగ్ తరంగ్’ ఒక అరగంట వుండేది. ఘజల్స్, గీత్‌లు వినిపించే కార్యక్రమంలో ఓ రోజు అద్భుతమైన ఘజల్ ప్రసారమైంది. పాడిన వారి పేరు ‘మధురాణి’. ఆమె పేరు అంతకు ముందెప్పుడూ మేమిద్దరం వినలేదు. రాజపుత్ర సంస్థానాల్లోని గాయని. సభా పిరికితనం వుండేదిట. తిన్నగా ఆయన కూర్చున్న గదిలోకి వెళ్లి రమ్మని వినిపించాను. విస్తుపోతూ విన్నాను. నోట మాట లేదు. ఆహా! ఏమీ పాట అని నిలయ విద్వాంసుల్ని పిలిచి వినమన్నారు. ‘ఆధార షడ్జం ఎక్కడ సార్?’ అన్నారు. అది తెలియకే తికమక పడ్తున్నానన్నాను.
ఆ రోజు అలా విన్న పాట విన్నట్లుగా స్వరం రాసేసి, మర్నాడు ఒక అరగంట ముందుగా వచ్చి నేనున్న స్టూడియోలోకి వచ్చి తాను రాసిన గజల్ ఆధారషడ్జం గుర్తించి మొత్తం పాట రాసేశారు, స్వరంతో సహితంగా. ఏకసంథాహి కదా! సంగీత కళానిధి డా.శ్రీపాద పినాకపాణి మూల విరాట్టైతే, నేదునూరి, వోలేటి ఇద్దరూ ఉత్సవమూర్తులై సంగీత లోకంలో అఖండ కీర్తిని పొందటం మన తెలుగు వారి పుణ్యం.

- మల్లాది సూరిబాబు 90527 65490