అమృత వర్షిణి
వాయువే...ఆయువు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సకల చరాచర సృష్టిలో అత్యుత్తమమైనది మానవజన్మ అని అందరూ భావించే మాటే. 84 లక్షల జీవరాశినీ సృష్టించే విధాత సంకల్పమేమిటో ప్రణాళిక ఏమిటో ఓ పట్టాన అంతుపట్టదు. పంచభూతాల సంగమంతో ఏర్పడ్డ జగత్తులో ఆనందప్రాప్తి కోసమే ప్రతీ ప్రాణీ పరితపిస్తుంది.
ఆనంద నిలయుడైన పరబ్రహ్మం ఆనందానికి కూడా అతీతుడే. ఇంటి కంటే ఇంటి యజమాని గొప్పవాడు కదా!
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణమ్ పాదసేవనమ్
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్
అని 9 రకాలుగా దైవంతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకునే మార్గాలుగా వ్యాస భగవానుడు భాగవతంలో చెప్పాడు.
అడగకుండా మనకు మానవజన్మ ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతలు చెప్పుకునే మార్గాల్లో మనకు ఏది అనుకూలమో దాన్ని అనుసరించే సదుపాయం ఉంది. అందుకే ఎంతో కొంత సమయాన్ని ధ్యానంతో దైవాన్ని స్మరించని వారెవరూ ఉండరు.
ఉపాసనా మూర్తులు వేరు కావచ్చు. మార్గాలు వేరవ్వచ్చు. కానీ, మన కంటే ఉన్నత శక్తి అంటూ ఒకటున్నదనేది మాత్రం నిజం.
ఆనందానుభవం చేత విజ్ఞానమయకోశాన్ని పరిపూర్ణం చేసుకున్న వారికి సాధనతో ఏర్పడ్డ భక్తి భావం స్థిరమై అనుభవంగా మారినప్పుడు అది మహనీయమై భగవత్ సాక్షాత్కారానికి దోహదం చేస్తుంది.
నిత్యం పోతన భాగవతాన్ని పారాయణం చేసిన త్యాగరాజ స్వామికి మహానుభావ ‘శబ్దం మనస్సులో బాగా కుదురుకోవటం వల్లనే’ ఎందరో మహానుభావులను గుర్తెరిగేలా చేసింది.
తుంబురు నారదాది గానమూర్తులతో బాటు ప్రహ్లాదాది బాలభక్తులను స్మరించాడు. పాడి, పాడి కీర్తనంతో ఆయన కూడా ఆ కోవలోకి చేరిపోయాడు.
లీలా మానుష విగ్రహుడైన పరమేశ్వరుని సంకల్పమే ఈ సృష్టి అనుకున్నాం కదా? కంటికి కనిపించకుండా ఓ ఆట ఆడించే వాణ్ని తలుచుకోకుండా ఉండగలమా?
లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవ భయదూరం సర్వలోకైకనాథం
అన్నారంటే అర్థం?
యోగులు ధ్యానం వల్లనే ఆనందాన్ని అనుభవిస్తారు. దీనికి యోగం తప్ప మరో మార్గం ఏదీ లేదు. అందుకే పరమయోగులు ఎన్నుకున్న మార్గం చిత్తవృత్తి నిరోధకమైన యోగమార్గం.
ప్రాణాయామంతోనే ఇది సాధ్యం. అని నమ్మిన యోగులు మాత్రమే దీన్ని అనుసరించగలిగారు.
మనసు అతి చంచలం. శాఖా భ్రమణం చేస్తూ ఎక్కడా ఒక చోట ఓ పట్టాన ఛస్తే నిలవదు కాబట్టే మర్కటంతో పోల్చారు.
చంచలంహి మనః కృష్ణప్రమాది బలవృద్ధుడమ్
తస్యాహం నిగ్రహం అనే్యవాయో వసు దుష్కరమ్
బలంగా వీచే గాలిని ఎలా అదుపు చేయలేమో మనస్సు కూడా అంతే అంటాడు శ్రీకృష్ణుడు.
ఏమాత్రం నిగ్రహించాలన్నా ఉండవలసినది శ్వాసమీద ధ్యాస. ఊపిరిపై దృష్టి అలవాటు చేసినకొద్దీ క్రమంగా నిరోధక శక్తి పెరిగి నెమ్మదిగా మనస్సు స్వాధీనమవుతుంది.
మనస్సు స్వాధీనమైన మనిషికి ఇంకా మంత్రం ఎందుకు? తంత్రాలెందుకు? అది లేకనే తీర్థయాత్రలూ వగైరాలు.
మనం చేసే పనులు, తినే తిండి, చేసే తపస్సు అన్నీ పైవాడికి అర్పించడం మొదలెడితే హృదయం కమలంలా స్వచ్ఛంగా పరిశుద్ధంగా దేదీప్యమానంగా ఉంటుంది.
అప్పుడు మనిషికీ దైవానికీ తేడా ఉండదు. ఆత్మ స్వరూపుడైన శ్రీహరి ప్రతీ ప్రాణి హృదయంలోనూ నివశిస్తున్నంత మాత్రాన మనతో మాట్లాడడు. పలకరించడు. లోపలున్నాడని తెలియపోవటమే అజ్ఞానం, అవివేకం. అంతరంగనాథుణ్ని బహిరంగం వెదికితే ఏం ప్రయోజనం? వెతకవలసినది ఎక్కడెక్కడో కాదు. ఆ భావ నారాయణుడు భావంలోనే ఉండగా మాటలకు అందుతాడా? అంతర్ముఖులై ఆరాధించాలి. ధ్యానమార్గంలోనే పట్టుకోవాలి. వాగ్గేయకారులై సంగీతాన్ని పట్టుకున్న మహానుభావులే దీనికి నిదర్శనం.
‘అంతర్యామీ! అలసితిసొలసితి నంటాడు
అన్నమయ్య ఏదో ఓ విధంగా చెవిని యిల్లుకట్టుకుని
పెద్దలు సర్వ వ్యాపకత్వాన్ని చెబుతూనే ఉన్నారు. జనం వింటూనే ఉన్నారు. ఏం ప్రయోజనం? అనుభవంలోకి తెచ్చుకుంటూ ఆత్మజ్ఞానం సంపాదించుకున్నది ఎక్కడో నూటికో కోటికో ఒక్కడే! అదీ రహస్యం.
ఎందరో మహానుభావుల్ని కీర్తిస్తూ త్యాగయ్య..
చందురు వర్ణుని అంద చందముల
హృదయారవిందమున జూచి
బ్రహ్మానందమనుభవించు వారెందరో
మహానుభావులన్నాడు.
త్యాగరాజ పంచరత్నాలు ఎరుగని, వినని సంగీత విద్వాంసుడంటూ ఉండడు.
పాడలేకపోయినా పక్కనే కూర్చుని పాడుతున్నామనే భ్రాంతితో పెదవులు కదిపేవాళ్లే ఎక్కువ, గమనించండి.
మా నాన్నగారు ఈ కీర్తనలు ఎంతో ఓపికతో చిన్నతనంలోనే శ్రద్ధగా నేర్పారు.
అర్థం తెలుసుకుని పాడే వయసు కాదు. అయినా నోటికి వచ్చేస్తాయి.
ఇప్పుడు అర్థం తెలిసి పాడుతోంటే కలిగిన ఆనందం అప్పుడు అస్సలు లేదు.
మనస్సు యొక్క స్థానం హృదయం.
ఇదే మహర్లోకం. దీని మీద చంద్రుడి ప్రభావం ఉంటుంది. మనస్సు చేత వాక్కు ప్రేరేపించబడుతుంది.
వాక్కు మనస్సులోకి ప్రయాణించడం వరకూ జ్ఞానికీ, అజ్ఞానికీ ప్రయాణం ఒక్కటే.
నాదోపాసన చేసిన వారికి హృదయ స్థానంలోని మనస్సు పైకిపోయి నాసికలోని ప్రాణాన్ని చేరుతుంది.
అజ్ఞానికి హృదయ స్థానం నుండి మనస్సు కిందికి జారిపోయి అపాన వాయువులోకి పడిపోతోంది.
నాదోపాసకుడు నాసిక నుంచి కనుబొమ్మల వరకూ (ఆజ్ఞా చక్రం వరకూ) ప్రజ్వరిల్లిన యోగాగ్నిలో ప్రవేశించి సహస్రారంలోని పరదేవతవైపుకు వెళ్లిపోతాడు - నాదోపాసకుడి విదేహముక్తి ఇదే. అది లేని వారు అధోగతిలో తోయబడి ఇంకో శరీరం వెతుక్కుంటూ వెళ్లిపోతారు.
మనస్సు ఉన్నంత వరకే కాలం పోకడ తెలిసేది
సమాధిలో అది లయమైతే
కాలం విలువ తెలియదు.
ఓంకారంతో లయమైన నాదాన్ని ఉపాసించటంతో వాంఛాసిద్ధి, బ్రహ్మండమైన నాద సిద్ధి, ఫలాలుగా చెప్పబడ్డాయి. కాబట్టే త్యాగరాజాది మహానుభావులంతా దీన్ని పట్టుకున్నారు.
అందుకే...
అఖిల నైగమాశ్రీత సంగీత జ్ఞానమనుః
ఆనంద సాగర మీదని దేహము భూభారమే అని త్యాగరాజు చెప్తూ
‘‘శ్రీ విశ్వనాధ శ్రీకాంత విధులు, పావనమూర్తులు ఉపాసించలేదా?
భావించి రాగ లయాదుల భజియించే
శ్రీ త్యాగరాజనుత’’
అని చెప్పి ముగించారు. బ్రహ్మానందం తరిగేది కాదు. ఇతరులు బలవంతంగా లాక్కునేదీ కాదు.
ఆయన అనుభవించిన పరమానందకరమైన ఆ బ్రహ్మానందప్రాప్తి అందరికీ సులభంగా దొరకదు. అందుకోగల సమర్థులైన వారికే దక్కుతుంది. అది అమృతోపమానం అక్షయం.
పరమ పావనులు, ఘనులు శాశ్వతులు
కమల భావసుఖము సదానుభవులైన
ఎందరో మహానుభావుల్ని త్యాగయ్య చేతులెత్తి ప్రార్థించాడు. ఈ మహానుభావులందరూ, విజ్ఞాన సంపన్నులు.
మానసవన చర సంచారము నిలిపి
దివ్యమూర్తిని దర్శించిన వారు అని నమ్మాడు.
మనసు నిల్వగలిగిన శక్తి గలవారికి ప్రాణమయ కోశం హాయిగా పరిపూర్ణమై, శుద్ధమై పోతుంది. ఆయువు అంటే వాయువే.
ప్రాణం హాయిని అనుభవిస్తుందన్న మాట.
స్వరలయాది రాగములు, భావ రాగ లయాది సౌఖ్యం వల్ల లభించిన హాయితో చిరాయువు కలిగిన వారి మనస్సు తొణకదు. బెణకదు.