S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

12/22/2018 - 18:59

జీవనది లాంటి సంగీతం ఏ ఒక్కరి సొత్తూ కాదు. అదో గంగా స్రవంతి. ఎవరెవర్ని పునీతుల్ని చేస్తుందో? ఎవరి కెరుక?

12/15/2018 - 17:49

వ్యవస్థలకు గుర్తింపు లభించేది ఎప్పుడైనా, ఎక్కడైనా అందులో పనిచేసే వ్యక్తుల వల్లే. ప్రభుత్వాధీనంలో కొన్ని బ్రహ్మ పదార్థంలా కనిపించే సంస్థలుంటాయి. ఎవరెవరు డైరెక్టర్లో, ఎవరికి మరెవరు సహాయకులో తెలియదు.

12/08/2018 - 18:40

ఆట, పాట మాటల కలయికే సంగీతం. ప్రపంచ జనాభా కోట్లలో వుండచ్చుగాక కానీ ఈ మూడింటిలోనూ ప్రజ్ఞ చాలా కొద్దిమందికే లభించే భగవంతుని వరం.
నాదోపాసనలో సగుణ సాక్షాత్కారాన్ని దర్శించిన మహాత్ములున్నారు. వారు తమ మనోభీష్ట రూపాలను దర్శించారు. ఆట పాటలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాళ్లున్నారు.

12/01/2018 - 19:09

కవిత్యం తెలియటం, కమ్మగా పాడాలనిపించడం, బొమ్మలు వేయటం మనిషికి సహజంగా పుట్టే లక్షణాలే. ఎరువు తెచ్చుకునేవి కావు.
కళ కళ కోసమే అనే భావన వుంటే, భౌతిక బలమే తప్ప, ఆధ్యాత్మిక బలం వుండదు.
సహజంగా అబ్బిన ఈ అపురూపమైన ప్రజ్ఞ దైవపరం చేస్తే ఇహపర సౌఖ్యాలు రెండూ లభిస్తాయి.
ఈ భూమీద వ్యక్తులెవ్వరూ కలకాలమూ ఉండకపోయినా, వారి జ్ఞాపకాలు నిలిచిపోవడానికి కారణం దైవమే.

11/24/2018 - 18:51

లోకంలో వాక్కును తపస్సుగా వినియోగించిన మహాపురుషులైన వారున్నారు. సర్వసంగ పరిత్యాగులైన యోగుల భాష వౌనమే. అదే వారి బలం. మాటే మన బలహీనత. అందుకే యోగులు ఒక్కసారి తేరిపార మనవైపు దృష్టి సారిస్తే చాలు. మన జాతకాలు చెప్పేయగలరు.

11/17/2018 - 19:09

సంగీతం మీద వ్యామోహం కొద్దీ పాడాలనే తపనతో అన్నీ వదిలేసి, దానినే పట్టుకుని సాధనతో పైకొచ్చిన వారినీ, నటన మీద ఉండే పిచ్చి ఆసక్తితో నాటకాలే జీవితంగా బ్రతికిన వాళ్లున్నారు. చూస్తూ వుంటాం. ఇప్పుడు సినిమాలు బయలుదేరాయి. ఒరేయ్! ఈ సంగీతం కూడు పెట్తుందా? ఉద్ధరిస్తుందా? నీ పిచ్చేగాని - అని వెనక్కి లాగేవాళ్లూ, ఈ నాటకాలేమైనా నిన్ను ఉద్ధరిస్తాయా? అంటూ నిరుత్సాహపరుస్తూ నీరుగార్చేలా మాట్లాడేవాళ్లకు లోటు లేదు.

11/10/2018 - 18:43

అన్ని విద్యల కంటే సంగీతమే కాస్త విచిత్రంగా కనిపించి అయోమయంగా ఉంటుంది. అంతా తెలిసినట్లే ఉంటుంది. దిగితే తప్ప లోతు తెలియదు. తెలియని విషయాలేవో అలా మిగిలిపోతూనే ఉంటాయి. తెలుసుకోవటానికి ఒక్క జీవితకాలం సరిపోదు. సాధారణంగా లోకంలో సంపూర్ణ మానవుడెలా కనపడడో సంపూర్ణ సంగీత విద్వాంసుడు కూడా వుండడు. సంగీతమే ఓ అర్థంకాని భాష.

11/03/2018 - 19:13

పాటకు పరవశించని వారంటూ ఉండరు. మోతాదుకు మించి ఉపన్యాసాలు దంచేస్తే వినేవారుండరు. ఆలిండియా రేడియోలో తెల్లవారగానే వినిపించే సూక్తుల వ్యవధి కేవలం నాలుగు నిమిషాలు. ఆ విన్న నాలుగు మాటలూ కనీసం నాలుగు రోజులపాటైనా మనసులో నిలిచిపోయేవి. సులభంగా అర్థమయ్యేదే సూక్తి. చెప్పేవాడికి వినేవాడు లోకువని చెప్పి కుండ బోర్లించేసినట్లు చెప్పినా ప్రమాదమే. ముచ్చటగా చెప్పాలి. మృదువుగా ముక్తసరిగానే చెప్పాలి. ‘మిత్రమా!

10/27/2018 - 18:55

‘సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగకరణి
సాలెపురుగు కడుపులోని నూలు వలెను
దబ్బునన్ దొర్లిపడు కొండధార మాడ్కి
సహజ కవిత బయల్పడు సన్నుతిగను’
మాతృభాష తెలుగే అయినా, పక్కనే ఆంగ్ల పదాలు కూడా రాస్తే తప్ప, కొందరికి మన భాష, మనకే అర్థం కాదు. కానీ ఈ పద్యంలోని భావం తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.

10/21/2018 - 07:30

ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది. మరి మీ విలువ ఎంత?

Pages