S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమృత వర్షిణి
ఒక మంచి మాట వినగలిగే ఓపిక, ఏదైనా మంచి పుస్తకం చదవాలనే కోరిక, తీరిక చాలామందికి తక్కువ. ఉన్నదల్లా ఒకటే- లోకాన్ని కబళించేయాలన్నంత కోరిక. నిజానికి తినటానికి ఉన్నంత ఉత్సాహం వినటానికి ఉండదు. కాల మహిమ కాదు.
సాధారణంగా కనిపించే జీవలక్షణం. ఎండలో తిరిగి బాగా అలిసిపోయిన తర్వాత చెట్టుకింద కాస్సేపు, కాస్త చల్లగాలిలో నిలబడితే కలిగే హాయిలా ఉండేలా శాస్త్రాలు పుట్టుకొచ్చాయి.
సమయం ఉదయం 11 గంటలు..
స్టూడియోలో చుట్టూ వాద్య బృందం.. మధ్యలో గాయకుడు మహమ్మద్ రఫీ.. కాస్త దూరంలో.. వాద్యబృందాన్ని మరో గదిలో పర్యవేక్షిస్తూ నిలబడ్డ సంగీత దర్శకుడు నౌషద్ అలీ.. ఆవేళ ఎందుకో రఫీ చాలా ఉదాసీనంగా ఉన్నారు రాగ్ పట్దీప్లో ఘజల్ శైలిలో..
నౌషాద్ స్వరపరచిన పాటను మహ్మద్ రఫీ తన్మయత్వంలో, నాద మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పాడేశాడు (అది సినిమా పాట కాదు).
‘దేశాహై తేరీ ఆంఖోఁ మే ప్యార్ హి ప్యార్ బేశుమార్..
పాయా హై తేరీ బాతోఁమే ప్యార్ హి ప్యార్
చేశుమార్..’ బాల్యం నుంచి బాగా విన్న నాకిష్టమైన పాట.
ఎంత డబ్బుంటే అంత భయం.
ఎంత వెలుగుంటే అంతే చీకటి.
తెలియకపోతే మానవ జీవితం ఒక గోల.
తెలిస్తే అదొక కల.
సృష్టి ధర్మానికి అనువుగా ఒక గృహస్థు తన కుటుంబ సభ్యులతోనూ, సమాజంలోని ఇతర వ్యక్తులతోనూ ఎలా ప్రవర్తిస్తాడో దాన్నిబట్టే మనిషి అకౌంట్లో పాపపుణ్యాలు చేరుతూంటాయి.
దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటూంటారు. దిక్కున్న వారికైనా ఆ దేవుడే దిక్కు. ఎందుకంటారా?
కూటి కొఱకే కోటి విద్యలు. అందులో సంగీతమొకటి. బ్రతుకుతెరువు కోసమే సంగీతాన్ని ఆశ్రయించిన కళాకారులకు సాధారణంగా సంగీతం మానసిక శాంతి నివ్వలేకపోవచ్చు. ప్రతిభ ప్రకృతిని పరవశింపచేసేందుకు ఉపయోగపడక పోవచ్చు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందలేక పోవచ్చు. కానీ హాయిగా జీవితం సాగిపోతుందనటానికి నిదర్శనంగా చెప్పుకోదగిన, మీకు తెలిసిన సంగీత దర్శకుల్ని గుర్తు చేస్తాను.
64లక్షల జీవరాశిలో భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం ఒక్క మనిషికే. ఎక్కడో సర్వసంగ పరిత్యాగులకు తప్ప నిన్నటి నిరాశకు, రేపటి ఆశల మధ్య వర్తమానంలో జీవిస్తున్నామనే స్పృహలో బ్రతికేది మనమే. ఒక విధంగా యిదో వరం. మరో విధంగా శాపం. తల్లిదండ్రులతోనే ఈ ఆశాపాశాల వలయానికి అంకురార్పణ మొదలౌతుంది.
‘రాజుల్ మత్తులు వారి సేవ నఱకప్రాయంబు వారిచ్చునం
బోజాక్ష చతురంగ యాన తురగీ భూషాదులాత్మ వ్యథా
బీజంబుల్, తదపేక్ష చాలు పరితృప్తిన్ బొందితిన్ జ్ఞాన ల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళ హస్తీశ్వరా!’
‘మనుష్యాణాం సహహ్రేషు’ అన్నాడు గీతాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మ. ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారో, అన్ని రకాల మనస్తత్వాలున్నాయి. లోకంలో ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. ఒకేలా మాట్లాడరు. ఆలోచించరు. ఉన్నదున్నట్లుగా అందుకుని జీవితాన్ని సఫలం చేసుకుని బతికేవాడు ఉత్తముడు.
భగవద్గీత కొంత వయసు మళ్లిన తర్వాత ఎక్కడో ఓ మూల కూర్చుని చదివే గ్రంథమని కొందరనుకుంటారు.
శ్రీరామచంద్రుడు మాయా మానుష విగ్రహ స్వరూపుడు. కృష్ణుడు లీలా మానుష విగ్రహ రూపుడు. దుష్ట శిక్షణ, ధర్మరక్షణే పరమావధిగా ఉన్నప్పటికీ త్రేతాయుగంలో రామావతారానికీ, ద్వాపర యుగంలో కృష్ణావతార ప్రయోజనానికీ వ్యత్యాసం ఉంది.