S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/28/2015 - 06:23

హైదరాబాద్, డిసెంబర్ 27: అయుత మహా చండీయాగం చివరి రోజు స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యాగానికి మరికొద్ది క్షణాల్లో పూర్ణాహుతి జరగాల్సి ఉండగా, ఈ కత్రువును నిర్వహించాల్సిన రాష్టప్రతి అదే సమయంలో యాగశాలకు నిప్పు అంటుకోవడంతో హెలికాప్టర్ నుంచే అగ్ని ప్రమాదాన్ని గ్రహించిన రాష్టప్రతి యాగస్థలిలో ల్యాండ్ కాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.

12/28/2015 - 06:17

సంగారెడ్డి, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎబివిపి పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. 33వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం గౌరీశంకర్ స్మారక అవార్డు ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

12/28/2015 - 06:13

సిద్దిపేట/జగదేవ్‌పూర్, డిసెంబర్ 27: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న అయుత చండీ మహాయాగం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమానికి విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్ ఇఎస్‌ఎల్.

12/28/2015 - 06:11

ఖమ్మం, డిసెంబర్ 27: రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 726 ఓట్లకుగాను 692 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మంలో 326కు 321, కొత్తగూడెంలో 226కు 199, పాల్వంచలో 115కు 113, భద్రాచలంలో 59కి 59 ఓట్లు పోలయ్యాయి.

12/28/2015 - 05:45

హైదరాబాద్, డిసెంబర్ 27: కొత్త సంవత్సరం వేడుకలపై సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 31న రాత్రి 8 గంటల నుంచి ఒంటి గంటలోపే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూఇయర్ సందర్భంగా డిజెకు అనుమతిలేదని, హోటళ్లలో కపుల్స్‌కు మాత్రమే అనుమతించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.

12/28/2015 - 05:14

హైదరాబాద్, డిసెంబర్ 27: శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 12 మండలి స్థానాలకు ఆరు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఆదివారం పోలింగ్ జరిగింది. నల్లగొండలో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య, ఖమ్మంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు, తెరాస అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణల మధ్య పోరు హోరాహోరీగా సాగింది.

12/28/2015 - 05:07

హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కేంద్రం నుంచి భారీ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. రెండు ప్రాజెక్టులకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను ఇప్పటికే అందించింది. కేంద్రం సాయం అందించే పథకాల కిందకు ఈ రెండూ వస్తాయి కనుక, భారీగానే నిధుల సాయం అందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

12/28/2015 - 05:05

హైదరాబాద్, డిసెంబర్ 27: లోకహితం, తెలంగాణ సుభిక్షాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన అయుత మహా చండీయాగం దిగ్విజయమైందని సిఎం చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తన చండీయాగ సంకల్పం నెరవేరాలని, నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదించిన శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామితో సహా ఎందరో మహాభావులకు పేరు పేరున సాష్టాంగ వందనాలని అన్నారు.

12/28/2015 - 05:03

నాలుగేళ్ల క్రితంనాటి మొక్కు తీర్చుకుంటూ సిఎం కెసిఆర్ నిర్వహించిన అయుత చండీయాగం ఐదోరోజు ఆదివారం మహాపూర్ణాహుతితో వైభవోపేతంగా పరిసమాప్తమైంది. చండీయాగ సంకల్పం నెరవేరేందుకు వెన్నుదన్నుగా నిలిచిన పీఠాధిపతులు, మాన్యులు, సామాన్యులకు పేరుపేరునా సాష్టాంగ నమస్కారాలని కెసిఆర్ అన్నారు. గత 23న రుత్విజుల మంత్రోచ్చారణల మధ్య ఆరంభమైన అయుత చండీయాగం ఐదురోజులపాటు నిర్విఘ్నంగా, నిష్ఠతో సాగింది.

12/27/2015 - 17:28

కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఎమానకొండూరు మండలం దుద్దనపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జైనూర్ ఎస్‌ఐ అంబేద్కర్ మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు, ఆటో ఢీకొన్న సందర్భంగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

Pages