తెలంగాణ

లోకహితం కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: లోకహితం, తెలంగాణ సుభిక్షాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన అయుత మహా చండీయాగం దిగ్విజయమైందని సిఎం చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తన చండీయాగ సంకల్పం నెరవేరాలని, నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదించిన శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామితో సహా ఎందరో మహాభావులకు పేరు పేరున సాష్టాంగ వందనాలని అన్నారు. యాగం ముగిసిన తర్వాత రుత్విజుల నుంచి ఆశీర్వాదం స్వీకరించిన తర్వాత యాగానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి సిఎం మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రతిష్ఠాకరంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు విజయవంతమైతే ప్రయుత మహా చండీయాగాన్ని నిర్వహించాలని మొక్కుకున్నట్టు వేదికపై సిఎం ప్రకటించారు. తెలంగాణ సాధన ఉద్యమం ఉధ్రుత రూపం దాల్చిన సమయంలో రాష్ట్ర సాధన జరిగితే అయుత చండీ మహాయాగం నిర్వహిస్తానని 2011లోనే మొక్కుకున్నట్టు సిఎం గుర్తు చేశారు. రుత్విజులకు తానిచ్చిన సంభావన చంద్రునికి నూలు పోగులాంటిందన్నారు. చండీయాగ నిర్వహణతో తన జీవితం సుసంపన్నమైందని కెసిఆర్ అన్నారు. ప్రజలు ఆశీర్వదించడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానన్నారు. త్వరలో మళ్లీ శృంగేరి పీఠానికివెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానన్నారు.

చిత్రం.. విజయవాడ నుంచి తెచ్చిన చీర, కుంకుమ, ప్రసాదాన్ని కెసిఆర్‌కు అందిస్తున్న చంద్రబాబు