తెలంగాణ

జగజ్జననికి జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగేళ్ల క్రితంనాటి మొక్కు తీర్చుకుంటూ సిఎం కెసిఆర్ నిర్వహించిన అయుత చండీయాగం ఐదోరోజు ఆదివారం మహాపూర్ణాహుతితో వైభవోపేతంగా పరిసమాప్తమైంది. చండీయాగ సంకల్పం నెరవేరేందుకు వెన్నుదన్నుగా నిలిచిన పీఠాధిపతులు, మాన్యులు, సామాన్యులకు పేరుపేరునా సాష్టాంగ నమస్కారాలని కెసిఆర్ అన్నారు. గత 23న రుత్విజుల మంత్రోచ్చారణల మధ్య ఆరంభమైన అయుత చండీయాగం ఐదురోజులపాటు నిర్విఘ్నంగా, నిష్ఠతో సాగింది. యాగశాల ఏర్పాటు చేసిన ఎర్రవల్లిలోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఆధ్యాత్మిక భక్త్భివం ద్యోతకమైంది. యాగం చివరి రోజున మహాపూర్ణాహుతి ముగుస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, యాగశాలలో అగ్నికీలలు చోటుచేసుకోవడం శుభసూచకమని, అమ్మవారు కరుణించినట్టేనని పలువురు పీఠాధిపతులు ప్రకటించటం విశేషం. అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాది భక్తులు తండోపతండాలుగా హాజరయ్యారు. అమ్మవారు కరుణించి ప్రతిష్ఠాత్మక పథకాలు సకాలంలో పూర్తి చేసుకోగలిగితే ప్రయుత చండీయాగం నిర్వహించుకుందామని ముగింపులో కెసిఆర్ ప్రకటించారు.

ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అయుత చండీయాగం ఆదివారం సాయంత్రం మహాపూర్ణాహుతితో ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మఠాధిపతుల నుంచి వివిధ రంగాల ప్రముఖులు, అశేషంగా భక్తులు చండీమాతను దర్శించుకున్నారు. రెండువేల మంది రుత్వికులు యాగంలో పాల్గొన్నారు.

సంప్రదాయ దుస్తుల్లో యాగానికి హాజరైన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా కెసిఆర్ స్వాగతం పలికారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి చీర, కుంకుమ, ప్రసాదం తీసుకొచ్చిన చంద్రబాబు కెసిఆర్‌కు అందించారు. యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి చండీమాతను దర్శించుకున్నారు.

అయుత చండీయాగం ముగింపులో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోమగుండం నుంచి వెలువడిన నిప్పురవ్వలు కుటీరానికి అంటుకోవడంతో మంటలు పైకి ఎగశాయ. సకాలంలో స్పందించిన అగ్నిమాపక అధికారులు ఎలాంటి నష్టంవాటిల్లకుండా మంటలను అదుపుచేయగలిగారు.

అయుత చండీయాగాన్ని దర్శించుకోకుండానే రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వెనుతిరిగారు. యాగశాల వద్ద
హెలీకాఫ్టర్ దిగాల్సిన సమయంలోనే అగ్నిప్రమాదం సంభవించి కలకలం రేకెత్తడంతో, ఆయన దిగకుండానే వెనుతిరిగారు.
దీంతో రాష్టప్రతి యాగానికి హాజరుకాలేకపోయారు.

చిత్రం.. అయుత చండీయాగం ముగింపులో మహాపూర్ణాహుతి నిర్వహిస్తున్న కెసిఆర్ దంపతులు