తెలంగాణ

చివరి రోజు స్వల్ప అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: అయుత మహా చండీయాగం చివరి రోజు స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యాగానికి మరికొద్ది క్షణాల్లో పూర్ణాహుతి జరగాల్సి ఉండగా, ఈ కత్రువును నిర్వహించాల్సిన రాష్టప్రతి అదే సమయంలో యాగశాలకు నిప్పు అంటుకోవడంతో హెలికాప్టర్ నుంచే అగ్ని ప్రమాదాన్ని గ్రహించిన రాష్టప్రతి యాగస్థలిలో ల్యాండ్ కాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో రాష్టప్రతికి స్వాగతం పలకడానికి అక్కడికి చేరుకున్న గవర్నర్ దంపతులతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఐదు రోజుల నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవెల్లిలో అయుత మహా చండీయాగాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యాగం ముగింపు చివరి రోజు ఐదవ రోజు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు అభిజిత్ లగ్న ముహుర్తంలో పూర్ణాహుతి కత్రువుతో ఇది ముగియాల్సి ఉంది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌లో బస చేసిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమం జరగాల్సి ఉంది. రాష్టప్రతి మరికొద్ది క్షణాల్లో హెలికాప్టర్‌లో యాగస్థలికి చేరుకోవాల్సిన తరుణంలో ఒంటి గంట పది నిమిషాల సమయంలో పూర్ణాహుతి పూజా కార్యక్రమాలను రుత్విజులు ప్రారంభించారు. ఆ సమయంలో ఒక రుత్విజుడు హోమ గుండంలో ఆజ్యాన్ని బకెట్‌తో గుమ్మరించడంతో ఒక్కసారిగా పైకి ఎగిసిన నిప్పురవ్వలు యాగశాల పైకప్పుకు అంటుకున్నాయ.
దీంతో అప్రమత్తమైన వాలంటీర్లు, అగ్నిమాపక సిబ్బంది భగ్గున మండుతున్న హోమ గుండాన్ని అగ్ని నిరోధక వాయువుల సిలిండర్లను ఉపయోగించి ఆర్పేశారు. అదే సమయంలో అగ్నిమాపక సిబ్బంది బందోబస్తు పర్యవేక్షిస్తున్న ఇద్దరు పోలీసులు కానిస్టేబుళ్లు యాగశాల స్తంభాలపైకి ఫైర్ ఇంజన్ పైపులను చేత పుచ్చుకొని చకచక ఎగబాకి మంటలు ప్రధాన యాగశాలలకు పాకకుండా నీళ్లు చల్లి ఆర్పివేయడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం సంభవించినప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు, వందల మంది రుత్విజులు ప్రధాన హోమగుండం ఎదుట ఉండటంతో వారు ప్రమాదాన్ని గ్రహించి హుటాహుటిన అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. అయినప్పటికీ నిప్పు అంటుకున్న యాగశాల పైకప్పు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. దీంతో పూర్ణాహుతి పూజా కార్యక్రమాన్ని గంటన్నర పాటు నిలిపివేసి, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతుల చేత ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దగ్ధమవుతున్న యాగశాల పైకప్పు... మంటలకు పూర్తిగా కాలిపోయన దృశ్యం (ఇన్‌సెట్‌లో)