S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

 -సయ్యద్ గౌస్‌పాషా
12/26/2015 - 06:17

తెలంగాణలో గత ఏడాది కంటే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయి. ఎలాంటి మత ఘర్షణలు లేకుండా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. పోలీసు శాఖలో చేపట్టిన నూతన సంస్కరణలు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఉపక్రమించాయి. ఏప్రిల్‌లో 4,5 తేదీలలో ఉగ్రవాదుల చేతుల్లో నలుగురు పోలీసులు హతం కాగా ఏప్రిల్ 6న వరంగల్ జిల్లా పెంబర్తి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్ సహా ఐదుగురు మృతి చెందారు.

12/26/2015 - 05:50

ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 25: ఐదు పదుల వయసులోనే ఆరోగ్యం క్షీణించి మంచం దిగని మనుషులను నేడు చూస్తున్నాం.. కొంత దూరం నడవగానే విశ్రాంతి కోసం తాపత్రయ పడుతుంటాం.. కానీ ఈ అవ్వ 135 ఏళ్లలోనూ ఇప్పటికింక నా వయసు..అంటూ చలాకీగా తన పనులు వడివడిగా చేసుకుంటోంది.. అన్నం, రొట్టెలను నమిలిమింగేస్తుంది.. మటన్, చికెన్ కావాలంటోంది.. ఐదు తరాల వారితో సంబురాలు జరుపుకుంటోంది..

12/26/2015 - 05:49

హైదరాబాద్, డిసెంబర్ 25: స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోతున్న ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీ అభ్యర్థులుగా ఇతర పార్టీల నుంచి చేరిన ఫిరాయింపుదారులను, పెట్టుబడిదారులను ప్రకటించిందని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు.

12/26/2015 - 05:34

హైదరాబాద్, డిసెంబర్ 25: పార్లమెంటులో బిల్లు పెట్టి సాధించుకున్న బౌగోళిక తెలంగాణ మాట సరే..సుదీర్ఘ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం సాహిత్యాన్ని మొదలుపెట్టాలని ప్రజాకవి గద్దర్ యువ సాహితీవేత్తలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్‌ఫెయిర్‌లో శుక్రవారం జరిగిన రచయిత కాశీం ‘తెలంగాణ సాహిత్యం’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు.

12/26/2015 - 05:31

నల్లగొండ, డిసెంబర్ 25: ‘నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని టిఆర్‌ఎస్ ఓడితే సీఎం పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలంటూ’ సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన సవాల్ విసిరారు.శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య

12/26/2015 - 05:31

ఆదిలాబాద్, డిసెంబర్ 25: ఉత్తరాదిన వీస్తున్న శీతల పవనాల ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా కనిష్ట స్థాయకి పడిపోయాయి. ఎనినో ప్రభావంతో నిన్నటివరకు ఎండ తీవ్రత, ఉక్కపోతను అనుభవించిన జిల్లా ప్రజలు అనూహ్యంగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో గురువారం రాత్రి నుండే చలిగాలులు, కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి.

12/26/2015 - 05:29

సంగారెడ్డి, డిసెంబర్ 25: అయుత చండీ మహాయాగం మూడవ రోజు శుక్రవారం ఉదయం గురు ప్రార్థనతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం 8.20 గంటలకు సిఎం కెసిఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేసారు. గురు ప్రార్థనలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ స్వామి వారికి వందే గురు పరంపర అంటూ రుత్విజులు పఠనం చేస్తుండగా ముఖ్యమంత్రి గురువుకు సాష్టాంగ ప్రణామం చేసారు.

12/26/2015 - 05:28

జగదేవ్‌పూర్, డిసెంబర్ 25: అయుత చండీ మహాయాగంలో చివరి రోజైన ఆదివారం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జి వస్తుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్టప్రతి బసచేయనున్న కుటీరాలతో పాటు హెలిప్యాడ్, రోడ్డు మార్గంలో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హెలిక్యాప్టర్ ద్వారా రిహార్సల్ నిర్వహించారు.

12/26/2015 - 05:27

సంగారెడ్డి, డిసెంబర్ 25: శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ భూముల్లో నిర్వహిస్తున్న అయుత చండీ మహాయాగంలో మూడవ రోజు రుత్విక్కులు శే్వత వస్త్రాలను ధరించి నిర్ణీత సమయానికి కార్యక్రామాన్ని ప్రారంభించారు.

12/26/2015 - 05:08

భద్రాచలం, డిసెంబర్ 25: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులోని చందామెట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టు శంకరన్న దళం సంచరిస్తుందన్న ఎస్‌ఐబీ, ఐబీ వర్గాల సమాచారంతో పోలీసులు ఈ అడవిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి.

Pages