S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/25/2015 - 11:39

హైదరాబాద్: క్రిస్మస్ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. సికిందరాబాద్, హైదరబాద్ సహా తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో చర్చిలను అందంగా అలంకరించారు. మెదక్ చర్చిలో తెల్లవారుఝాము 5 గంటల నుంచే జనం తాకిడి కనిపించింది. కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా పలువురు భక్తులు మెదక్ చర్చిని సందర్శించేందుకు వచ్చారు.

12/25/2015 - 11:37

మెదక్: తెలంగాణా సీఎం కె.సి.ఆర్. మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తన ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్న అయుత చండీయాగం మూడోరోజు కార్యక్రమాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. కెసిఆర్ దంపతులు గురుప్రార్థనతో యాగాన్ని ప్రారంభించారు. గణపతి పూజ, చండీ పారాయణం, నవగ్రహ స్తుతి వంటి కార్యక్రమాలను రుత్విజులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎ.పి.

12/25/2015 - 07:30

గోదావరి జలాలు తెచ్చి రైతుల కన్నీళ్లు తుడుస్తా
సాగునీరు, విద్యుత్ ఉంటే రైతుకు కష్టాలు ఉండవు
భూసేకరణకు రైతులు సహకారం అందించాలి
నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

12/25/2015 - 07:30

ఐఏఎస్, ఐపిఎస్, చీఫ్‌జస్టిస్‌లకు మాత్రమే
అపోహలు నమ్మవద్దని ఎంపి బూర నర్సయ్యగౌడ్ పిలుపు

12/24/2015 - 15:09

హైదరాబాద్: అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో మనస్తాపం చెందిన లక్ష్మి అనే గృహిణి గురువారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని బేగంపేట ప్రకాష్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. రెండేళ్ల క్రితం లక్ష్మికి విదేశ్ అనే వ్యక్తితో పెళ్లి చేసినపుడు భారీగానే కట్నకానుకలు చెల్లించారు. అయితే, మరో 15 లక్షల రూపాయలు తీసుకురావాలంటూ విదేశ్ నుంచి ఆమెకు ఇటీవల వేధింపులు అధికమయ్యాయి.

12/24/2015 - 11:53

హైదరాబాద్:సెల్‌ఫోన్ చోరీ కేసులో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తనను కొట్టడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగుచూసింది. మీర్జాలగూడలో 17 ఏళ్ళ తరుణ్ యాదవ్‌ను సెల్‌ఫోన్ చోరీకేసులో పోలీసులు తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ దూషించి కొట్టడంతో తరుణ్ తీవ్రంగా మనస్తాపం చెందాడు.

12/24/2015 - 11:52

హైదరాబాద్:బాలానగర్ ప్రాంతంలో కల్తీ నెయ్యి తయారుచేస్తున్న ఓ ఇంటిపై గురువారం ఉదయం పోలీసులు దాడిచేసి 300 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరిని అరెస్టు చేశారు.

12/24/2015 - 11:51

హైదరాబాద్:పాఠశాలనుంచి ఇంటికి వస్తుండగా తొమ్మిదేళ్ళ బాలుడు కిడ్నాప్ అయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మొఘల్ కాలనీలో జరిగింది. బుధవారం సాయంత్రం నుంచీ సయ్యద్ ఒబేద్ అనే బాలుడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీకోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

12/24/2015 - 11:50

మెదక్:తెలంగాణ సి.ఎం కెసిఆర్ ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో గురువారం ఉదయం అయుత చండీయాగం రెండోరోజు కార్యక్రమాలను గురుప్రార్థనతో ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి జగమేశ్వర్, తెలంగాణ మంత్రులు మహమ్మద్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావు తదితరులు హాజరయ్యారు.

12/24/2015 - 06:59

హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణలో మత్స్యకారులకు ప్రస్తుతం చెల్లిస్తున్న ప్రమాద పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచాలని, అన్యాక్రాంతమైన అటవీ భూములను స్వాధీనం చేసుకొని వాటి పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది.

Pages