S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/24/2015 - 06:02

హైదరాబాద్, డిసెంబర్ 23: దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో పివి 11వ వర్ధంతిని టిపిసిసి నిర్వహించింది.

12/24/2015 - 05:12

హైదరాబాద్, డిసెంబర్ 23: నిరుపేద దళిత రైతులకు మూడు ఎకరాల ఉచిత భూమి పంపిణిలో ఏర్పడ్డ భూ కొరతను తీర్చడానికి ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే దళితుల ఆక్రమణలో ఉన్న భూమిపై వారికే భూ హక్కులు కల్పించే దిశగా ఎస్‌సి కార్పొరేషన్ అసలైన పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.

12/24/2015 - 05:10

వరంగల్, డిసెంబర్ 23: జనవరిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. బుధవారం చిట్యాల మండల కేంద్రంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుదారులపై సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం తీసుకుంటున్నామని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తానన్నారు.

12/24/2015 - 05:09

హైదరాబాద్, డిసెంబర్ 23: కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్‌శాఖ నిర్వహించిన ‘డిజిటల్ ఇండియా వీక్’ అవార్డులకు తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ మూడు జిల్లాలు ఎంపికైనట్టు ప్రభుత్వ ప్రభాన కార్యదర్శి రాజీశ్ శర్మకు సమాచారం అందింది.

12/24/2015 - 05:09

హైదరాబాద్/ సంగారెడ్డి, డిసెంబర్ 23: శృంగేరి పీఠం తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మహత్కార్యం అయుత మహా చండీయాగం రుత్విక్కులు నిర్ణయించిన శుభ ముహుర్తంలో బుధవారం ఉదయం 8.30 గంటలకు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా ప్రారంభమైంది.

12/23/2015 - 17:44

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత, ఎపి సిఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు బుధవారం నగరంలోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయమై వీరు చర్చించారు. ఎన్నికల్లో బిజెపితో పొత్తు విషయం కూడా చర్చించారు. ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వాసులకు ఎలాంటి మేనిఫెస్టో ఇవ్వాలన్న అంశంపై సమాలోచనలు జరిపారు.

12/23/2015 - 16:49

కరీంనగర్: సుల్తానాబాద్ మండలం పూతల గ్రామం దరి శాస్ర్తీనగర్ వద్ద బుధవారం ఉదయం ఓ సైకో వీరంగం చేసి నానా బీభత్సం సృష్టించాడు. దుకాణాలపైన, రోడ్డుపై వెళ్లే వాహనాలపైన రాళ్లతో ఇతను దాడి చేయడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. చివరికి కొందరు ధైర్యం చేసి సైకోను పట్టుకుని చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి సైకోను తీసుకుపోవడంతో జనం ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.

12/23/2015 - 11:33

హైదరాబాద్: ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు బుధవారం ఉదయం ఎల్‌బి నగర్, ఆరాంఘర్, సాగర్ రింగ్‌రోడ్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలను విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన 46 బస్సులను సీజ్ చేశారు.

12/23/2015 - 11:33

హైదరాబాద్: చైన్ స్నాచర్ల భరతం పడతామని పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో నగరంలో రాజేంద్రనగర్ లక్ష్మీనగర్ కాలనీ వద్ద బుధవారం ఉదయం మరో చైన్ స్నాచింగ్ సంఘటన జరిగింది. తన ఇంటి ముందు పూలు తెంచుకొని వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆ మహిళ మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసును తెంచుకొని పరారయ్యారు. కింద పడిపోయిన మహిళ స్వల్పంగా గాయపడింది.

12/23/2015 - 11:32

మెదక్: తెలంగాణ సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ ఆవరణలో బుధవారం ఉదయం అయుత చండీయాగానికి శ్రీకారం చుట్టారు. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం 8.30 గంటలకు కెసిఆర్ దంపతులు యాగశాలలో ప్రవేశించారు. ఆయనకు పండితులు వేద మంత్రోచ్ఛారణ మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా యాగంలో పాల్గొన్నారు. వందలాది మహిళలు కుంకుమార్చన చేశారు.

Pages