తెలంగాణ

అయుత చండీయాగం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: తెలంగాణ సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ ఆవరణలో బుధవారం ఉదయం అయుత చండీయాగానికి శ్రీకారం చుట్టారు. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం 8.30 గంటలకు కెసిఆర్ దంపతులు యాగశాలలో ప్రవేశించారు. ఆయనకు పండితులు వేద మంత్రోచ్ఛారణ మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా యాగంలో పాల్గొన్నారు. వందలాది మహిళలు కుంకుమార్చన చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వేద పండితులు, రాజకీయ ప్రముఖులు రావడంతో ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.