తెలంగాణ

చండీయాగానికి శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ సంగారెడ్డి, డిసెంబర్ 23: శృంగేరి పీఠం తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మహత్కార్యం అయుత మహా చండీయాగం రుత్విక్కులు నిర్ణయించిన శుభ ముహుర్తంలో బుధవారం ఉదయం 8.30 గంటలకు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా ప్రారంభమైంది. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి సొంత వ్యవసాయ క్షేత్రంలో ఐదు రోజుల పాటు 15 వందల మంది రుత్విక్కుల సమక్షంలో జరి ఈ యాగం కోసం యాగశాలలోకి ఉదయం 8.30 గంటలకు వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి దంపతులు ప్రవేశించారు. ఆ తర్వాత 8.45 గంటలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు యాగస్థలికి చేరుకోగా ముఖ్యమంత్రి దంపతులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ రవిశంకర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితర ప్రముఖులంతా ఒక్కొక్కరుగా యాగస్థలికి చేరుకున్నారు. మొదటి రోజు గోపూజ, మహా మంటప స్థాపనంతో యాగం ప్రారంభమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భోసలే, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, దుర్గాప్రసాద్ సాయంత్రం యాగస్థలికి వచ్చారు. మహామహా రాజులు కూడా చేయలేని బృహత్కార్యం, ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తలకెత్తుకున్న అయుత చండీయాగ సంకల్పం నెరవేరాలని శృంగేరి పీఠాధిపతి, జగద్గురు భారతీతీర్థ స్వామి ఆశీర్వదించారు. ఈ మేరకు ఆయన ఓ సందేశాన్ని పంపారు. యాగశాలలో శృంగేరి నుంచి వచ్చిన రుత్విక్కులు భారతీతీర్థ స్వామి ఆశీర్వచనాలను చదివి వినిపించారు.యాగ నిర్వహణను స్వయంగా పర్యవేక్షించడానికి శృంగేరి పీఠాధిపతి ప్రత్యేక దూతగా వచ్చిన ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌరీ శంకర్ ఈ సందర్భంగా జగద్గురు ఆశీస్సులను అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రుత్విక్కులతో యాగశాల ‘మినీ ఇండియా’గా గోచరిస్తోందని అన్నారు. నాలుగేళ్ల క్రితం శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామి నిర్వహించిన పద్ధతిలోనే సిఎం కెసిఆర్ వైదిక సంప్రదాయాలకు అనుగుణంగా యాగం చేస్తున్నారని అభినందించారు. సాయంత్రం వేళ యాగం ముగిసిన తర్వాత ఉసద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు చతుర్వేద పారాయణం చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో గడిపిన గవర్నర్ దంపతులు హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఉదయం పది గంటల దాకా భక్తుల తాకిడి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నానికల్లా రద్దీ బాగా పెరిగింది. మొదటి రోజే 50 వేలకు పైగా భక్తులు యాగాన్ని సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారంనుంచి ప్రభుత్వ సెలవుదినాలు అయినందున రోజుకు లక్షకు పైగానే భక్తులు తరలి వచ్చినా ఆశ్చర్యం లేదు. కాగా, మంత్రి హరీశ్ రావుఎప్పటికప్పుడు విఐపిల రాకపోకలు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను చూసారు. వాహనాల పార్కింగ్ కూడా దూరంగా ఏర్పాటు చేయడం వల్ల భక్తులు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా, దుమ్మూ, ధూళి దృష్ట్యా దూరంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

చిత్రం... అయుత చండీయాగం తొలిరోజు బుధవారం యాగశాలల హోమపూజలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ నరసింహన్ దంపతులు