S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/23/2015 - 06:41

హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నేతలు హెచ్చరించారు.

12/23/2015 - 04:15

కరీంనగర్, డిసెంబర్ 22: యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉన్మాదిగా మారి తల్లిదండ్రులు సహా రోడ్డుమీద దొరికినోళ్లను దొరికినట్లుగా తల్వార్‌తో గాయపరుస్తూ బీభత్సం సృష్టించి చివరకు పోలీసుల తూటాకు బలయ్యాడు. కరీంనగర్‌లోని కమాన్ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. లక్ష్మినగర్‌కు చెందిన అవతార్‌సింగ్, సత్వంత్‌బేబికౌర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు.

12/23/2015 - 03:54

హైదరాబాద్, డిసెంమర్ 22: రాష్టవ్య్రాప్తంగా అనుమతిలేని నిర్మాణాలు, అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్), ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) పథకాలపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. పథకాలపై దాఖలేన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, తదుపరి విచారణ జనవరి 27న జరుపుతామని వెల్లడించింది.

12/23/2015 - 03:49

హైదరాబాద్, డిసెంబర్ 22: లోకకళ్యాణం, విశ్వశాంతి కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీయాగం బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాబోతుంది. చండీయాగానికి ముందు చేయాల్సిన పూజా కార్యక్రమాలను మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య వారు యాగశాలలోకి ప్రవేశించారు.

12/22/2015 - 11:49

హైదరాబాద్: తనతో పెళ్లికి నిరాకరించిన ఓ యువతిని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొద్ది రోజులు నిర్బంధించగా, షీ టీం చొరవతో ఆమెకు విముక్తి లభించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సయ్యద్ ఓ యువతిని నిర్బంధించాడు. ఆ యువతి వాట్సప్ ద్వారా ఈ విషయాన్ని బెంగుళూరులో ఉన్న తన సోదరుడికి సమాచారం ఇచ్చింది. దీంతో షీ టీం పోలీసులు మంగళవారం ఆమెకు విముక్తి కలిగించారు.

12/22/2015 - 11:47

కరీంనగర్: మతిస్థిమితం కోల్పోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విచక్షణా రహితంగా తల్లిదండ్రులపై కత్తితో దాడికి ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడి లక్ష్మీనగర్‌కు చెందిన సర్దార్ బల్వీందర్ సింగ్ మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఉన్మాదిగా మారిపోయి తల్లిదండ్రులపైన, అడ్డు వచ్చిన స్థానికులపైనా కత్తితో దాడి చేశాడు.

12/22/2015 - 08:22

నిజామాబాద్, డిసెంబర్ 21: జిల్లాకు ప్రధాన ఆధారంగా ఉన్న నిజాంసాగర్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సాగునీటి ప్రయోజనం కల్పించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కాల్వలను ఆధునీకరించేందుకు వీలుగా ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

12/22/2015 - 08:21

సంగారెడ్డి, డిసెంబర్ 21: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పటన్‌చెరు మండలం ముత్తంగి వద్ద ఉన్న ప్రార్థన స్థలాన్ని అధికారులు తొలగించే విషయమై అడ్డుకుని కలెక్టర్, ఎస్పీలపై దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, పాషాఖాద్రీ, ఆజంఖాన్, మొజంఖాన్‌లు సోమవారం సంగారెడ్డిలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు.

12/22/2015 - 08:21

శ్రీశైలం ప్రాజెక్టు, డిసెంబర్ 21: శ్రీశైలం ప్రాజెక్టులో గత 10 సంవత్సరాల కాలం నుంచి ఎన్నడూ లేనంతగా నీటి నిలువ కనిష్ట స్థాయికి చేరుకున్నది. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను సోమవారం సాయంత్రానికి 834.20 అడుగులుగా పూర్తి నీటి నిలువ సామర్థ్యం 210 టిఎంసిలకు గాను 54.054 టి ఎంసిలుగా నిలువ ఉన్నది.

12/22/2015 - 08:21

కరీంనగర్/మహబూబ్‌నగర్ డిసెంబర్ 21: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తాజాగా మరో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామానికి చెందిన ఇరుగురాళ్ల తిరుపతి (26) అనే రైతు ఆదివారం సాయంత్రం పత్తిచేను వద్ద పురుగుల మందు తాగాడు.

Pages