తెలంగాణ

రూ. 4050 కోట్లతో కాల్వల ఆధునీకరణ : పోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 21: జిల్లాకు ప్రధాన ఆధారంగా ఉన్న నిజాంసాగర్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సాగునీటి ప్రయోజనం కల్పించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కాల్వలను ఆధునీకరించేందుకు వీలుగా ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కేవలం ఈ రెండు ప్రాజెక్టుల కాల్వల ఆధునికీకరణ కోసమే 4050 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు. వర్ని మండలంలోని పాతవర్ని, హుమ్నాపూర్ గ్రామాల్లో సుమారు 4కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సోమవారం మంత్రి పోచారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పాత వర్నిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల పోరాటం ఫలితంగా స్వరాష్ట్రం సాధించుకున్న నేపథ్యంలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపాలని, ప్రతి ఒక్కరి కళ్లలో వెలుగులు చూడాలన్న తపనతో ముఖ్యమంత్రి కెసిఆర్ అహరహం శ్రమిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఎకరాలకు సాగునీటిని అందిస్తూ తెలంగాణలోని బీడు భూములను సైతం సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో 40వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నరని చెప్పారు. వచ్చే జనవరి మాసంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లలోకి నీటిని మళ్లించనున్నారని మంత్రి పోచారం పేర్కొన్నారు. తద్వారా ఖరీఫ్, రబీ సీజన్‌లలో రెండు పంటలకూ సమృద్ధిగా సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి ఆయకట్టు వరకు కూడా సాగు జలాలు చేరుకోవాలనే ఉద్దేశ్యంతో నిజాంసాగర్, ఎస్సారెస్పీ కాల్వల ఆధునికీకరణ పనులకు 4050కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గంలో 85కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, మరో 40కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నాయన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమైతే తామంతా కాలువల పైనే ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయించి తెలంగాణ రైతాంగానికి లబ్ధి చేకూరుస్తామన్నారు. మునుముందు తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏకంగా 91,500కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నామని వివరించారు. అంతకుముందు మంత్రి పోచారం పాత వర్ని, బొప్పాపూర్‌లలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులకు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా పాతవర్ని నుండి బోధన్ ఆర్ అండ్ బి రోడ్ వరకు చేపడుతున్న పనులకు, హన్మాపూర్‌లో ఇంటర్నల్ రోడ్డు, పాతవర్ని వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, హన్మాపూర్‌లో పంచాయతీ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్‌తో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.