తెలంగాణ

పోలీసు తూటాలకు సైకో ఇంజనీర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: మతిస్థిమితం కోల్పోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విచక్షణా రహితంగా తల్లిదండ్రులపై కత్తితో దాడికి ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడి లక్ష్మీనగర్‌కు చెందిన సర్దార్ బల్వీందర్ సింగ్ మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఉన్మాదిగా మారిపోయి తల్లిదండ్రులపైన, అడ్డు వచ్చిన స్థానికులపైనా కత్తితో దాడి చేశాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానిక వన్ టౌన్ పోలీసులు అతడిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సిఐ విజయసారథి బల్వీందర్ సింగ్ నడుము భాగంలో కాల్పులు జరిపారు. గాయపడిన బల్వీందర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. గాయపడిన అతని తల్లిదండ్రులను, ఓ కానిస్టేబుల్‌ను మరో 20 మంది స్థానికులను ఆస్పత్రికి తరలించారు. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న బల్వీందర్ ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షలో అర్హత సాధించక పోవడంతో తీవ్ర మానసిక వత్తిడికి లోనయ్యాడు. ఉన్నత చదువులు చదివిన ఆయన పోలీసు తూటాలకు బలి కావడం బంధువులను విషాదంలో ముంచెత్తింది.