S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/19/2015 - 06:29

మంచిర్యాల, డిసెంబర్ 18: మంచిర్యాల ఐబి ఇరిగేషన్ శాఖలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో ఈఈ వినోద్‌కుమార్, డిప్యూటీ ఈఈ బాల సిద్దులను ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

12/19/2015 - 06:28

సిద్దిపేట, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతలు పూర్తిగా ఎత్తివేసి.. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు టిఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి వెల్లడించారు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్‌ఇ కార్యాలయ పనులను పరిశీలించారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

12/19/2015 - 06:27

హైదరాబాద్, డిసెంబర్ 18: రాష్ట్రంలో పేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. వీటి నిర్మాణానికి అవసరం అయిన స్థలాలను రెవెన్యూ శాఖ అనే్వషిస్తోందని తెలిపారు. 10 జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్థలాల అనే్వషణపై దృష్టిసారించినట్టు చెప్పారు. అవసరం అయిన స్థలాల కోసం వివిధ సంస్థలతో చర్చిస్తున్నట్టు తెలిపారు.

12/19/2015 - 06:27

హైదరాబాద్, డిసెంబర్ 18: రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయకు కేంద్రం తగిన సహాయం అందించాలని, అవసరం అయిన అనుమతులు తక్షణం మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జాతీయ వాటర్ మిషన్ అదనపుకార్యదర్శి నిఖిలేష్ ఝాను కోరారు. గ్రాండ్ కాకతీయలో శుక్రవారం జరిగిన సమావేశంలో నిఖిలేష్‌తో హరీశ్‌రావు సమావేశం అయ్యారు.

12/19/2015 - 02:38

హైదరాబాద్, ఉప్పల్, డిసెంబర్ 18: అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలంగాణ ఐటి మంత్రి కె.తారక రామారావు అన్నారు.

12/19/2015 - 02:37

హైదరాబాద్, డిసెంబర్ 18: ‘తాను తలపెట్టిన అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులే. ఎలాంటి ఆంక్షలు ఉండవు. స్వీయ క్రమశిక్షణ పాటిస్తే అదే చాలు’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘చండీయాగాన్ని నిర్వహించాలన్న నిర్ణయం ఇప్పటిది కాదు. నాలుగేళ్ళ కిందట తెలంగాణ సిద్ధిస్తే చేస్తానని మొక్కుకున్న’ అని వివరించారు.

12/19/2015 - 02:33

హైదరాబాద్, డిసెంబర్ 18:పురాతనమైన, అతి విలువైన నిజాం నగలు ఎట్టకేలకు హైదరాబాద్‌కు శాశ్వతంగా తరలిరానున్నాయి. ఉమ్మడి ప్రభుత్వంలోనే ఈ నగలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. అవి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. రాష్ట్రానికి నిజాం నగలు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే అత్యంత విలువైన ఆ నగల భద్రత విషయంలో సంతృప్తి చెందిన తరువాతనే నగలను హైదరాబాద్‌కు తరలిస్తారు.

12/19/2015 - 02:25

రెండువారాల దక్షిణాది విడిదికి వచ్చిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి శుక్రవారం సాయంత్రం హకీంపేట ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలుకుతున్న గవర్నర్ నరసింహన్, సిఎం కెసిఆర్. అనంతరం రాష్టప్రతి ప్రణబ్ బొల్లారంలోని నిలయానికి చేరుకున్నారు.

12/18/2015 - 08:01

సూర్యాపేట, డిసెంబర్ 17: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నుండి ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి -సి 29 రాకెట్ ప్రయోగంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన శాస్తవ్రేత్త చెరుకుపల్లి వెంకటరమణ పాల్గొని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సింగపూర్‌కి చెందిన ఆరు ఉపగ్రహాలను అనుకున్న కక్ష్యలోకి పంపి ఈ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా పనిచేసి ఖ్యాతి పొందారు.

12/18/2015 - 08:01

హైదరాబాద్, డిసెంబర్ 17: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో ఓటర్ల తొలగింపులో అక్రమాలు జరిగాయని టిపిసిసి ఆరోపించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు అఖిల పక్షం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా సవరణలు లేకుండా ఎన్నికలకు వెళితే తాము కోర్టుకు వెళతామని టిపిసిసి అధికార ప్రతినిధులు కమలాకరరావు, నిరంజన్‌లు అన్నారు.

Pages