తెలంగాణ

కోర్టుకు హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 21: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పటన్‌చెరు మండలం ముత్తంగి వద్ద ఉన్న ప్రార్థన స్థలాన్ని అధికారులు తొలగించే విషయమై అడ్డుకుని కలెక్టర్, ఎస్పీలపై దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, పాషాఖాద్రీ, ఆజంఖాన్, మొజంఖాన్‌లు సోమవారం సంగారెడ్డిలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. అనీల్‌కుమార్ సింఘాల్ కలెక్టర్‌గా పని చేసినప్పుడు లింగంపల్లి నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు నాలుగు లైన్ల రోడ్డుగా ఏర్పాటు చేయడంలో భాగంగా ముత్తంగి వద్ద ఉన్న ప్రార్థన స్థలం తొలగింపు విషయంలో కలెక్టర్‌పై ఎంఐఎం నేతలు దురుసుగా వ్యవహరించారు. ఈ విషయమై పటన్‌చెరు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసారు. ఈ కేసుకు సంబంధించిన వాయిదాలను కోర్టులో హాజరు కాకపోవడంతో అక్బరుద్దీన్‌తో పాటు ఎంపి అసదోద్దీన్‌పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేయగా గత యేడాది జైలుకు సైతం వెళ్లిన విషయం తెలిసిందే. సోమవారం నాడు కోర్టుకు హాజరైన ఎమ్మెల్యేలకు కేసు పరిశీలను కోర్టు మరోమారు వాయిదా వేసింది. ఎంఐఎం ఎమ్మెల్యేలు జిల్లా కోర్టుకు హాజరవుతున్నారని తెలిసి సదాశివపేట పట్టణానికి చెందిన పలువురు ఎంఐఎం నాయకులు కోర్టు వద్దకు చేరుకున్నారు.