S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/24/2015 - 06:59

హైదరాబాద్, డిసెంబర్ 23: తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో గ్రేటర్ హైదరాబాద్ టిడిపి నాయకులు సమావేశమై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ టిడిపి అధ్యక్షుడు మాగంటి గోపినాథ్, ఇతర పార్టీ నేతలూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

12/24/2015 - 06:58

హైదరాబాద్, డిసెంబర్ 23: ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణను ప్రైవేటు లిమిటెడ్‌గా మారుస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఇప్పటివరకు తెలంగాణకు రావలసిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించలేదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

12/24/2015 - 06:57

హైదరాబాద్, డిసెంబర్ 23: వెనుకబడిన తరగతులకు ఉద్యోగ నియామకాల్లో సంపన్నశ్రేణి వర్తిం ప చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేస్తూ ఈ నెల 30న హైదరాబాద్‌లో నిరహార దీక్ష చేయనున్నట్టు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను ఉధ్ధతృం చేయనున్నట్టు ఆయన హెచ్చరించారు.

12/24/2015 - 06:44

సుల్తానాబాద్, డిసెంబర్ 23: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామ పంచాయతీ పరిధిలోని శాస్ర్తినగర్ వద్ద బుధవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శాస్ర్తినగర్‌లోని అంజయ్య అనే రైతు కనిపించిన వారిపై రాళ్లతో దాడి చేయడం, రాజీవ్ రహదారిపై అడ్డంగా నిలబడి వాహనాల రాకపోకలను అడ్డుకున్నాడు. కనబడిన వ్యక్తులను కొడుతూ గాయపర్చాడు.

12/24/2015 - 06:43

నల్లగొండ, డిసెంబర్ 23: మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దివంగత కొనపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడి హత్య కేసులో నరుూం మూఠా సభ్యులపై నల్లగొండ జిల్లా పోలీసులు పెట్టిన కేసు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా భువనగిరి 5వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.ఎ.రజాక్ కొట్టివేశారు.

12/24/2015 - 06:43

సిద్దిపేట, డిసెంబర్ 23: కల్యాణలక్ష్మి పథకాన్ని బిసిలతో పాటు అగ్రవర్ణాల పేదలకు వర్తింప చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్‌రావు వెల్లడించారు. గతంలో కల్యాణలక్ష్మి పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రమే వర్తింప జేశారన్నారు. ఇప్పుడు పేద యువతులందరికీ కల్యాణలక్ష్మి పథకం కింద 51 వేలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.

12/24/2015 - 06:41

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 23: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంక్ ట్యాంకు తండాలో బుధవారం ఒక పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన రమావత్ బుజ్జి (35) తన తమ్ముడు రవి పెళ్లి జరుగుతుండగా స్పీకర్‌లో ఒకరిని రమ్మంటూ పిలిచేందుకు స్పీకర్ పట్టుకుని మాట్లాడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఇంట్లో ఒకేసారి విషాదం చోటు చేసుకుంది.

12/24/2015 - 06:41

గద్వాల, డిసెంబర్ 23: రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మితమైన మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు జిల్లాకే తలమానికంగా పేరొందింది. అలాంటి జూరాల ప్రాజెక్టు వద్ద ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇట్టే అర్థవౌతుంది.

12/24/2015 - 06:40

హైదరాబాద్, డిసెంబర్ 23: మహమహా రాజులు కూడా చేయలేని బృహత్కార్యాన్ని ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తలకెత్తుకున్న అయుత మహా చండీయాగ సంకల్పం సంపూర్ణంగా నెరవేరాలని శృంగేరి పిఠాధిపతి, జగద్గురు భారతీ తీర్థ స్వామి ఆశీర్వదించారు. అయుత చండీయాగం విజయవంతం కావాలని ఆశీర్వదిస్తూ శృంగేరి పిఠాధిపతి భారతీతీర్థ స్వామి ముఖ్యమంత్రికి సందేశాన్ని పంపించారు.

12/24/2015 - 06:35

సంగారెడ్డి/జగదేవ్‌పూర్ డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తలపెట్టిన అయుత చండీయాగం అద్భుతంగా ప్రారంభమైంది. వేదమంత్రాల ఘోషతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. గురు ప్రార్థనతో చండీమాత విగ్రహం ముందు తొలిరోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి దంపతులు, గవర్నర్ దంపతులతో వేద పండితులు మహాగణపతి పూజ, మహాసంకల్పం చెప్పించారు.

Pages