తెలంగాణ

ఆ భూములు అమ్ముకోవచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: నిరుపేద దళిత రైతులకు మూడు ఎకరాల ఉచిత భూమి పంపిణిలో ఏర్పడ్డ భూ కొరతను తీర్చడానికి ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే దళితుల ఆక్రమణలో ఉన్న భూమిపై వారికే భూ హక్కులు కల్పించే దిశగా ఎస్‌సి కార్పొరేషన్ అసలైన పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దళితుల అధీనంలో ఉన్న భూమిని తిరిగి పొందడంలో అనేక సమస్యలు ఉండటంతో, ఆధీనంలో ఉన్నవారికే వాటిని విక్రయించడానికి రైతులకు అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ విలువ మేరకు కాకుండా మార్కెట్ ధర చెల్లించి రైతుల నుంచి భూమి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దళితులకు ఉచిత భూమి పథకానికి తమ భూములు అమ్మడానికి రైతులు ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. నిరుపేద దళితులకు ఉచితంగా భూ పంపిణి చేసే పథకాన్ని రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే దళితులకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద వ్యవసాయ భూమి అందుబాటు లేక పోవడంతో పథకం చతికిలబడింది. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నర వ్యవధిలో దళితులకు సుమారు రెండు వేల ఎకరాలను మాత్రమే పంపిణి చేయగలిగింది. దీంతో ప్రభుత్వానికి వచ్చిన భూ కొరత సమస్యను తీర్చడానికి దళితులకు, ఇతర రైతులకు మధ్య ఉన్న వివాదాస్పద భూములను కొనుగోలు ద్వారా ఈ సమస్యను అధిగమించే వ్యూహంలో భాగంగా ప్రభుత్వానికి భూ విక్రయానికి ముందుకు వచ్చే రైతులకు అవకాశం కల్పించింది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
‘భూమి లేని నిరుపేద దళిత రైతులకు 3 ఎకరాల భూమి పంపిణి’ కార్యక్రమానికి భూమి అమ్మడానికి ముందుకు వచ్చేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎస్‌సి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూమి విక్రయించే రైతులు జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.ఎల్‌పిఎల్‌డిఎస్.గౌవ్.ఇన్ వెబ్‌సైట్‌మవ నమోదు చేసుకోవాల్సిందిగా ఎంవి రెడ్డి పేర్కొన్నారు. జిల్లాల వారీగా సంప్రదించాల్సిన అధికారుల ఫోను నంబర్లు, చిరునామాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఆయన పేర్కొన్నారు.