తెలంగాణ

దేశాన్ని గట్టెక్కించిన పివి ఆర్థిక సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో పివి 11వ వర్ధంతిని టిపిసిసి నిర్వహించింది. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసేలా చేశారని ఉత్తమ్ అన్నారు. పివి చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచానికి ఆదర్శప్రాయమయ్యాయని ఆయన తెలిపారు. భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందడానికి పివి కారణమని అన్నారు.
కేక్ కట్ చేసిన ఉత్తమ్
ఇలాఉండగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బుధవారం గాంధీ భవన్‌లో టిపిసిసి క్రిస్టియన్ విభాగం, ఎస్‌సి విభాగం ఏర్పాటు చేసిన వేడుకల్లో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేక్ కట్ చేశారు.

హైదరాబాద్‌లోని పి.వి.ఘాట్‌లో నివాళులర్పిస్తున్న టిపిసిసి నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి