S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/26/2015 - 04:49

హైదరాబాద్, డిసెంబర్ 25: రాష్ట్రంలో తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నందున వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చర్చించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని టి.టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు.

12/26/2015 - 04:46

హైదరాబాద్, డిసెంబర్ 25: రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫార్మాసిటీ (ఔషధ నగరి) కోసం కొనసాగుతున్న భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ మొదలైంది. ఫార్మాసిటీ కోసం సుమారు 10,939 ఎకరాలు సేకరించాల్సి ఉండగా అందులో కందుకూరు మండలం ముచ్చెర్ల రెవిన్యూ పరిధిలోని సర్వే నెం.288లో భూ కేటాయింపు ప్రక్రియ సక్రమంగా జరగలేదన్న ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం విచారణ మొదలుపెట్టింది.

12/26/2015 - 04:45

హైదరాబాద్, డిసెంబర్ 25:తెలంగాణకు జరిగిన అన్యాయంపై అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్ తన అనుచరులతో పాటు శుక్రవారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌లో చేరారు.

12/26/2015 - 04:43

హైదరాబాద్, డిసెంబర్ 25: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా అని టిటిడిపి రైతు విభాగం అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి మంత్రి కె.తారకరామారావు (కెటిఆర్)కు సవాల్ విసిరారు. విదేశాల్లో కెటిఆర్ పర్యటించి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు తప్ప తెలుగుదేశం హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందనే విషయాన్ని ఎందుకు వెల్లడించడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

12/26/2015 - 04:42

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 25: విద్యార్థి పరిషత్ నేతగా నేర్చుకున్న పాఠాలే రాజకీయంగా ఎదగడానికి దోహదపడ్డాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) రాష్ట్ర 33వ మహాసభలు శుక్రవారం జిల్లాకేంద్రం సంగారెడ్డిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

12/26/2015 - 04:14

హైదరాబాద్, డిసెంబర్ 25: ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను మధ్యతరగతి ప్రజానీకానికి నామమాత్రపు రుసుంతో క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 59 కింద చెల్లింపులకు డిసెంబర్ నెలాఖరుతో గడువు ముగిసిపోనుంది. ఆక్రమిత స్థలాలకు దరఖాస్తుదారులు ఎంత మొత్తం డబ్బు చెల్లించాలో ఇంతకాలంగా కాలయాపన చేసిన రెవిన్యూ శాఖ, గడువు ముగియడానికి వారంముందు ఈనెల 23న నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంది.

12/26/2015 - 04:12

హైదరాబాద్, డిసెంబర్ 25: రాష్ట్రంలో తొమ్మిది వర్శిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకానికి ఇంతవరకూ 208 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. జనవరి 8 వరకూ దరఖాస్తు గడువున్నా, దాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉంది. పదిమంది ప్రొఫెసర్లు ఐదారు వర్శిటీలకు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించారు. వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి ఇంతవరకూ ఉమ్మడి రాష్ట్రంలోవున్న నిబంధనలను ఇటీవలే తెలంగాణ సవరించింది.

12/26/2015 - 04:01

ఎర్రవల్లిలోని
తన ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న అయుత చండీయాగం మూడోరోజు శుక్రవారం శృంగేరి పీఠాధిపతి
శ్రీ భారతీ తీర్థస్వామి, ప్రత్యేక అతిథి త్రిదండి చినజీయర్ స్వామిలతో కలిసి హోమం వద్ద పూజలు
నిర్వహిస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్ దంపతులు.

12/25/2015 - 16:59

హైదరాబాద్: లాలాగూడ పోలీసుల వేధింపుల ఫలితంగా మరో యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన శుక్రవారం జరిగింది. సెల్‌ఫోన్ చోరీ కేసుకు సంబంధించి ఎస్‌ఐ కొట్టాడని మనస్తాపం చెంది తరుణ్ యాదవ్ అనే యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకోగా, అతని మిత్రుడు ముఖేష్ శుక్రవారం ఉదయం యాసిడ్ తాగాడు. ముఖేష్‌ను వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

12/25/2015 - 16:58

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, షబ్బీర్ అలీ, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Pages