S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/28/2015 - 06:53

హైదరాబాద్/బేగంపేట, డిసెంబర్ 27: రాజధాని నగరంలో ల్యాండ్ మాఫియా విజృంభిస్తోంది. భూ తగాదాలు, ఆక్రమణలు, సెటిల్‌మెంట్ పేర్లతో ల్యాండ్ మాఫియా నగర శివారులతో పాటు రాజధానిని వణికిస్తోంది. గత రెండు నెలల వ్యవధిలోనే నాలుగు హత్యలు జరిగాయి. తాజాగా శనివారం రాత్రి జరిగిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యతో నగరం ఉలిక్కిపడింది.

12/28/2015 - 06:52

హైదరాబాద్, డిసెంబర్ 27: హైదరాబాద్ నగరం పరిధిని మురికివాడలరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఇంతవరకు 4200 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టినా అనుకున్న లక్ష్యం నెరవేరలేదని లోక్‌సత్తా పార్టీ ప్రధాన కార్యదర్శి సాంబిరెడ్డి తెలిపారు. 2012 సంవత్సరంలో ప్రభుత్వ సర్వే ప్రకారం 1476 మురికివాడలు ఉండేవని, వీటి సంఖ్య 1504కు చేరుకున్నాయన్నారు.

12/28/2015 - 06:51

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టే విధంగా తప్పుడు వాగ్దానాలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. బంజారా భవన్, కొమురం భీమ్ ఆదివాసీ భవన్, బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లకు గత ఏడాది డిసెంబర్ 14న శంకుస్థాపన చేసి ఇంతవరకు పూర్తి చేయలేదని వారు విమర్శించారు.

12/28/2015 - 06:51

హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రజాకళామండలి కార్యదర్శి కోటిని కోర్టులో హాజరుపరచి వెంటనే విడుదల చేయాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్, కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నారని వారు ఆరోపించారు.

12/28/2015 - 06:37

హైదరాబాద్/కాచిగూడ, డిసెంబర్ 27: హైదరాబాద్‌లో నిర్వహించిన పుస్తక ప్రదర్శన మహాయజ్ఞంలాగా కొనసాగిందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ సేడియంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన ఆదివారం ముగింపుసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తక పండుగను గత పదిరోజులుగా చూస్తుంటే తిరుపతిలో బ్రహోత్సవాలను తిలకించినట్లు ఉందన్నారు.

12/28/2015 - 06:28

హైదరాబాద్, సంగారెడ్డి, డిసెంబర్ 27: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సుభిక్షాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత మహా చండీయాగం వైభవోపేతంగా పరిసమాప్తం అయింది.

12/28/2015 - 06:28

హైదరాబాద్, డిసెంబర్ 27: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత చండీయాగంలో పూర్ణాహుతి సందర్భంగా యాగశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం శుభ సూచకమేనని విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. దేశంలో ఎవరూ సాహసించని రీతిలో ముఖ్యమంత్రి కెసిఆర్ యాగం నిర్వహించారని స్వామిజీ కొనియాడారు.

12/28/2015 - 06:27

హైదరాబాద్, డిసెంబర్ 27: అయుత మహా చండీయాగం చివరి రోజు స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యాగానికి మరికొద్ది క్షణాల్లో పూర్ణాహుతి జరగాల్సి ఉండగా, ఈ కత్రువును నిర్వహించాల్సిన రాష్టప్రతి అదే సమయంలో యాగశాలకు నిప్పు అంటుకోవడంతో హెలికాప్టర్ నుంచే అగ్ని ప్రమాదాన్ని గ్రహించిన రాష్టప్రతి యాగస్థలిలో ల్యాండ్ కాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.

12/28/2015 - 06:25

హైదరాబాద్, సంగారెడ్డి, డిసెంబర్ 27: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సుభిక్షాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత మహా చండీయాగం వైభవోపేతంగా పరిసమాప్తం అయింది.

12/28/2015 - 06:24

Pages