తెలంగాణ

మంటలు శుభసూచకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత చండీయాగంలో పూర్ణాహుతి సందర్భంగా యాగశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం శుభ సూచకమేనని విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. దేశంలో ఎవరూ సాహసించని రీతిలో ముఖ్యమంత్రి కెసిఆర్ యాగం నిర్వహించారని స్వామిజీ కొనియాడారు. అయుత చండీయాగం అద్భుతంగా జరగడంతో పాటు పూర్ణాహుతి సందర్భంగా యాగశాలకు మంటలు అంటుకోవడం ఏ విధంగా చూసినా శుభసూచకమేనని స్వామి అభిప్రాయపడ్డారు.
యాగం సర్వ సంపూర్ణంగా
సఫలం: మాడుగల నాగఫణిశర్మ
అయుత మహా చండీయాగం భారతీ తీర్థస్వామి పర్యవేక్షణలో సుసంపన్నం అయిందని అవధాని మాడుగుల నాగఫణీ శర్మ అన్నారు. అభిజిత్ లగ్నంలో పూర్ణాహుతి జరగాల్సి ఉండగా అంతకుముందుగానే శాస్త్రోక్తంగా యాగశాలకు మంటలు అంటుకొని ఆ కత్రువు జరిగిపోయిందని అన్నారు.
అమ్మ కరుణించి అగ్నిహోత్రున్ని
పంపింది: తొగుట పిఠాధిపతి
యాగం చివరి రోజు విరామ సమయంలో జరిగిన చిన్నపాటి అగ్ని ప్రమాదంతో భయపడాల్సింది లేదని, అమ్మ కరుణించి అగ్నిహోత్రుడిని పంపించిందని, అమ్మ కృపకు పాత్రులమయ్యామని సంతోషించాలని తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. ఐదు రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో యాగాన్ని నిర్వహించిన రుత్విజులది కానీ, సంకల్పం తీసుకున్న కెసిఆర్‌ది కానీ, అధికారులదికానీ, చూడటానికి వచ్చిన భక్తులది కానీ ఎవరి పొరపాట్లు లేవన్నారు. అన్నీ సవ్యంగా సాగాయని యాగం ముగిసిన అనంతరం ఆగ్నేయంలో చేయాల్సిన పనిని అమ్మవారే అగ్నిహోత్రుడి ద్వారా చేయించిందని ఇది శుభ సంకేతంగా భావించాలని మాధవానందస్వామి అన్నారు. మహాద్భుత ఫలితం కోసం నిర్వహించిన యాగం ప్రతిఫలాన్ని చండీమాత త్వరగా అందించి రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుందామని అభిలషించారు.