తెలంగాణ

పుస్తకం అమ్మలాంటిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కాచిగూడ, డిసెంబర్ 27: హైదరాబాద్‌లో నిర్వహించిన పుస్తక ప్రదర్శన మహాయజ్ఞంలాగా కొనసాగిందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ సేడియంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన ఆదివారం ముగింపుసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తక పండుగను గత పదిరోజులుగా చూస్తుంటే తిరుపతిలో బ్రహోత్సవాలను తిలకించినట్లు ఉందన్నారు. వచ్చే సంవత్సరం మరింత గొప్పగా నిర్వహించడానికి ప్రయత్నం చేయాలని నిర్వాహకులకు సూచించారు. పుస్తకం అమ్మలాంటిదని, పుస్తకాన్ని గౌరవించాలని అన్నారు. తెలంగాణలోని ప్రతి జిలాల్లో పుస్తక ప్రదర్శన నిర్వహించడానికి ప్రయత్నించాలని కోరారు. పుస్తక ప్రదర్శనకు కావల్సిన సహాయ, సహకారాలను అందించాడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం మాజీ డిజిపి పేర్వారం రాములు మాట్లాడుతూ నిజమైన పుస్తకాలు హృదయాన్ని ఆకట్టుకుంటాయని అన్నారు. తనకు పఠనాసక్తిని కలిగించినవి గ్రంథాలయాలేనన్నారు. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ డిజిపి పేర్వారం రాములు. చిత్రంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్, తదితరులు