తెలంగాణ

వాగ్దానాలు మరచిన కెసిఆర్ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టే విధంగా తప్పుడు వాగ్దానాలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. బంజారా భవన్, కొమురం భీమ్ ఆదివాసీ భవన్, బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లకు గత ఏడాది డిసెంబర్ 14న శంకుస్థాపన చేసి ఇంతవరకు పూర్తి చేయలేదని వారు విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, రవీందర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ డి రాజ్‌కుమార్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కనీసం ఆ భూమి యాజమాన్య హక్కులు కూడా చూడకుండా గిరిజనులు, దళితులను మోసం చేస్తూ శంకుస్థాపన చేశారని విమర్శించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తానని, అందుకు నిధులు కేటాయిస్తానని చెప్పి ఇంతవరకు ఆ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీపై విరుచుకుపడ్డారు. మిలాద్ ఉన్ నబి పండుగ వేదికను కూడా రాజకీయానికి అసదుద్దీన్ ఒవైసీ వాడుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ అనేది హైదరాబాదీలదే అని ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ స్పందిస్తూ ఒవైసీ సోదరుల స్వస్థలం ఏదని ప్రశ్నించారు. ‘మీ తాత అబ్దుల్ వాహెద్ ఒవైసీ ఎక్కడి నుంచి వచ్చారు, మహారాష్ట్ర లోని ఓసా నుంచి వచ్చారు’ అని అసదుద్దీన్‌ను ఉద్దేశించి షబ్బీర్ అన్నారు.