S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/29/2015 - 07:57

కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపణ
హైదరాబాద్, డిసెంబర్ 28: దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మతతత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి బిజెపి ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.

12/29/2015 - 07:56

మినీ స్ట్టేడియంలో అసంపూర్తిగా పనులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
అభివృద్ధి పనులు ప్రారంభించకుండానే వెనుతిరిగిన మంత్రి
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయిస్తానని హౌసింగ్ ఇఇపై మండిపాటు

12/28/2015 - 18:41

మహబూబ్ నగర్: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫీయా ఆగడాలపై న్యాయవాది ప్రవీన్ కూమార్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. సోమవారం నాడు హైకోర్టు రెండు ప్రభుత్వాల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకించి హైపవర్ కమిటిని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా గతంలోఆదేశించినా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

12/28/2015 - 16:29

వేములవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం కుటుంబ సమేతమంగా వేములవాడ రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు..కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తూర్పుద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన కేసీఆర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు సీఎంకు తీర్థ ప్రసాదాలు అందించారు.

12/28/2015 - 12:38

హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో మరో నాలుగు రోజులు తీవ్ర చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రత మరింత తగ్గుతాయి. చలి తీవ్రతకు వరంగల్ జిల్లాలో ఇద్దరు మరణించారు.

12/28/2015 - 12:13

హైదరాబాద్: ఐటి రంగంలో భారతీయుల ఆధిపత్యం క్రమంగా పెరుగుతోందని, దేశం అన్ని విధాలా ముందుకు పోయేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ ఇఇఓ సత్య నాదెళ్ల అన్నారు. ఆయన సోమవారం నగరంలోని టి-హబ్‌ను సందర్శించి అక్కడి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టార్టప్‌ల రంగంలో మన యువత దూసుకుపోతోందన్నారు. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆయనకు స్వాగతం పలికి, ఐటి హబ్ గురించి వివరించారు.

12/28/2015 - 07:23

బిజెపి తెలంగాణ శాఖ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. గ్రాడ్యుయేట్ల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది, టిఆర్‌ఎస్‌ను కంగుతినిపించింది. అయతే వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికల్లో చతికిలబడింది.

12/28/2015 - 07:22

కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులతోపాటు కొత్తగా నిర్మించబోయే పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణను, గోదావరిపై నిర్మించబోయే తుమ్మిడిహట్టి, ప్రాణహిత-కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టుల ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది.

12/28/2015 - 06:54

హైదరాబాద్, డిసెంబర్ 27: ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని, హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదగాలంటే శాంతి నెలకొనాల్సి ఉందని, ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సి ఉందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు.

12/28/2015 - 06:53

నర్సంపేట, డిసెంబర్ 27: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గుట్టల్లో పోలీసులు ఆదివారం తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిల మృతదేహాలను కనుగొన్నారు. పర్వతగిరి మండలం నారాయణపురం తండాకు చెందిన బానోతు ప్రియాంక (14), బానోతు భూమిక (14) నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. జ్వరం వస్తోందని చెప్పి నవంబర్ 9న ఈ ఇద్దరూ ఇంటికి వెళ్లారు.

Pages