తెలంగాణ

దేశ విచ్ఛిన్నానికి బిజెపి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపణ
హైదరాబాద్, డిసెంబర్ 28: దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మతతత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి బిజెపి ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ను బలహీనపర్చే కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ కాం గ్రెస్ పార్టీ అని అన్నారు. 131 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. దేశంలో బిజెపి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోందని, పేద వర్గాలకు నష్టం చేకూరే పనులను అడ్డుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్.. కాంగ్రెస్‌ను బలహీనం చేయాలని చూస్తోందని, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అటువంటి వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, సిఎల్‌పి నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీలు హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం దానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు.