తెలంగాణ

వరంగల్ జిల్లాలో ఇద్దరు యువతుల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, డిసెంబర్ 27: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గుట్టల్లో పోలీసులు ఆదివారం తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిల మృతదేహాలను కనుగొన్నారు. పర్వతగిరి మండలం నారాయణపురం తండాకు చెందిన బానోతు ప్రియాంక (14), బానోతు భూమిక (14) నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. జ్వరం వస్తోందని చెప్పి నవంబర్ 9న ఈ ఇద్దరూ ఇంటికి వెళ్లారు. రెండు రోజుల అనంతరం వసతి గృహానికి వెళుతున్నామని చెప్పి కనిపించకుండా పోయారు. తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు నవంబర్ 23న పర్వతగిరి పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. కాగా చెన్నారావుపేట మండలంలోని ఖాదర్‌పేట గ్రామంలో ఊరకుక్కలు మనుషుల శరీర భాగాలను నోట్లో కరుచుకుని కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా ఈ ఇద్దరు విద్యార్థినిల మృతదేహాలు వెలుగు చూశాయి. పది రోజుల క్రితమే ఈ ఇద్దరు విద్యార్థినిలు మృతిచెందివుంటారని సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే అర్థం అవుతోంది. మృతదేహాలు కుళ్లిపోగా ఊర కుక్కలు పీక్కతిన్నాయి. చేతులు, కాళ్లతో పాటు శరీర భాగాలు వేరయ్యాయి. విద్యార్థినిలను నమ్మించి ఖాదర్‌పేట గుట్టల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు రంగంలోకి దిగాయి. ఈ సంఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది.