తెలంగాణ

పెరిగిన మురికివాడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: హైదరాబాద్ నగరం పరిధిని మురికివాడలరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఇంతవరకు 4200 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టినా అనుకున్న లక్ష్యం నెరవేరలేదని లోక్‌సత్తా పార్టీ ప్రధాన కార్యదర్శి సాంబిరెడ్డి తెలిపారు. 2012 సంవత్సరంలో ప్రభుత్వ సర్వే ప్రకారం 1476 మురికివాడలు ఉండేవని, వీటి సంఖ్య 1504కు చేరుకున్నాయన్నారు. అలాగే ప్రభుత్వ రికార్డుల ప్రకారం పాతమున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 1986లో 662 మురికివాడలు ఉండగా, వాటి సంఖ్య 964కు చేరుకున్నాయన్నారు. రాజధానిలో బోరబండలో 20 సంవత్సరాలుగా ఉంటున్న పేద ప్రజలకు పట్టాలు ఇవ్వలేదన్నారు. షేక్‌పేటలో వాంబే ఇండ్లను నిర్మించినా ఉపయోగంలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కెసిఆర్ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం మురికివాడల రహితంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికను ఖరారు చేయాలన్నారు. డిఎఫ్‌ఐడి, ప్రపంచ బ్యాంకు, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, జిహెచ్‌ఎంసి అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, కేంద్రం రూ.4223 కోట్లు ఖర్చుపెట్టాయన్నారు.