తెలంగాణ

వేడుకకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: కొత్త సంవత్సరం వేడుకలపై సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 31న రాత్రి 8 గంటల నుంచి ఒంటి గంటలోపే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూఇయర్ సందర్భంగా డిజెకు అనుమతిలేదని, హోటళ్లలో కపుల్స్‌కు మాత్రమే అనుమతించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. పత్రికలు, హోర్డింగ్‌లపై అశ్లీల చిత్రాలు, అర్ధనగ్న ఫొటోలతో ప్రచారం నిషేధమన్నారు. సైబరాబాద్ పరిధిలో 25 స్టార్ హోటళ్లు, 3 పబ్‌లు, 22 రిసార్ట్స్, 269 ఫాంహౌస్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ ఆనంద్ హెచ్చరించారు. ఔటర్ రింగ్‌రోడ్డు ఈనెల 31న రాత్రి గం. 8నుంచి జనవరి ఉదయం గం. 5.00ల వరకు మూసేస్తామని, అత్యవసర, విదేశీ పర్యాటకులు, ప్రయాణికులకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా రాత్రి ఒంటి గంట తరువాత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని సిపి ఆనంద్ హెచ్చరించారు. హైదరాబాద్ టాంక్ బండ్‌పై న్యూఇయర్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలతోపాటు, వేడుకలపై కూడా ఆంక్షలు విధించినట్టు నగర కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. టాంక్‌బండ్‌పై బాణసంచా పేల్చడం, డిజెలు ఏర్పాటు చేయడం వంటి వాటిని నిషేధించామని, ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతించామని సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. నగరంలోని హోటళ్లపై నిఘా వేశామని, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సిపి సూచించారు.