తెలంగాణ

బాబుకు ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/జగదేవ్‌పూర్, డిసెంబర్ 27: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న అయుత చండీ మహాయాగం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమానికి విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్ ఇఎస్‌ఎల్. నరసింహన్, కేంద్ర మంత్రి సృజనాచౌదరి, ఎపి డిప్యూటీ సిఎం కె.కృష్ణమూర్తి, మంత్రి గంట శ్రీనివాస్ హాజరు కాగా తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. యాగశాలకు చేరుకోగానే సీఎం కేసిఆర్ సాదరంగా ఆహ్వానించి హోమగుండం వద్దకు తీసుకెళ్ళారు. హోమగుండం వద్ద పూజా సామాగ్రి హోమగుండంలో వేసి ఇద్దరూ సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం చంద్రబాబును కేసిఆర్ శాలువాతో సన్మానించి చండీమాత విగ్రహాన్ని బహూకరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కాగా, తెలంగాణ డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, కవిత, విహెచ్ హన్మంతరావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, బాబుమోహన్, చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ కొండా మురళీ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టి.మంత్రులు