తెలంగాణ

రాష్ట్రానికి మిషన్ ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కేంద్రం నుంచి భారీ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. రెండు ప్రాజెక్టులకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను ఇప్పటికే అందించింది. కేంద్రం సాయం అందించే పథకాల కిందకు ఈ రెండూ వస్తాయి కనుక, భారీగానే నిధుల సాయం అందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కేంద్రం బీహార్‌కు, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఇదే తరహాలో ఆంధ్రకూ ప్యాకేజీ ప్రకటించనుందనే సమాచారంతో, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సైతం సాయం అందించాలని ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే నీతి ఆయోగ్‌తోపాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిని రాష్ట్ర మంత్రులు కలిశారు. ప్యాకేజీ ఇవ్వలేమంటూనే, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని పేర్కొన్నందున ఆమేరకు సాయం అందించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో అమలవుతోన్న పథకాల వివరాలు అందించాలని కేంద్ర మంత్రి, నీతి ఆయోగ్ సూచించింది. వీటిలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కేంద్రం నుంచి సాయం లభించే అవకాశం ఉందని తెలియడంతో, రెండు పథకాల డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి అందించారు. మిషన్ కాకతీయకు 30వేల కోట్లు, మిషన్ భగీరథకు 35వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండు పథకాల ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు తాగునీరు అందించడంతో పాటు చెరువుల పూడిక తీత ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొంది. మిషన్ భగీరథకు 35వేల కోట్లు అవుతుండగా, ఏటా తొమ్మిదివేల కోట్లు కేంద్రం సహాయం చేయాలని తెలంగాణ కోరింది. ఈ పథకానికి కేంద్రం నుంచి ఆశించిన మేరకు నిధులందే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రెండు పథకాలకు అవసరమైన నిధులు వివిధ బ్యాంకు రుణాలు, నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకుంటున్నారు. అయితే ఆశించిన స్థాయిలో కేంద్రం సహాయం చేస్తే తెలంగాణపై ఆర్థిక భారం తగ్గుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మిషన్ కాకతీయ మొదటి దశ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రెండోదశ పనులు జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో మిగిలిపోయిన పనులను సత్వరం పూర్తి చేయాలని, చేపట్టని పనులు చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మిషన్ కాకతీయ మొదటి దశ పనుల ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ఈ పథకం కింద మొత్తం 45వేల చెరువులను పునరుద్ధరించనున్నారు. ఏటా తొమ్మిది వేల చెరువుల చొప్పున ఐదేళ్లలో ఐదువేల చెరువులు పునరుద్ధరిస్తారు. ఎక్కడైనా ఎక్కువ చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు వచ్చినా ఆమోదించనున్నట్టు నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యేలకు తెలిపారు. ఇక మిషన్ భగీరథ పథకానికి సంబంధించి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇంటింటికి మంచినీరు అందించేందుకు చేపట్టిన ఈ పథకం మొదటి దశలో భాగంగా మార్చినాటికి తొమ్మిది నియోజక వర్గాల్లో మంచినీటిని అందించనున్నారు. తొమ్మిది నియోజక వర్గాల్లో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గం సైతం ఉంది.