తెలంగాణ

పైకి ధీమా.. లోపల గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 12 మండలి స్థానాలకు ఆరు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఆదివారం పోలింగ్ జరిగింది. నల్లగొండలో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య, ఖమ్మంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు, తెరాస అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. విజయం మాదంటే మాదేనంటూ రెండు జిల్లాల్లో ప్రధాన పక్షాలు ప్రకటిస్తున్నా, ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. నల్లగొండ జిల్లాలో 99.10 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ తరువాత తెరాస, కాంగ్రెస్‌లు గెలపుపై ధీమా వ్యక్తం చేశాయి. రెండు ప్రధాన పక్షాలు క్యాంపులు నిర్వహించి పోలింగ్ రోజున ఓటింగ్ కేంద్రాలకు బృందాలుగా తీసుకొచ్చారు. క్యాంపునుంచి జెడ్పీటీసీ, ఎంపిటీసి, కౌన్సిలర్లు బస్సుల్లో పోలింగ్ బూత్‌కు చేరుకొని ఓటు వేశారు. తెరాస అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిలు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట పోలింగ్ స్టేషన్‌లో ఓటువేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి గంటసేపు అక్కడే ఉండటంతో ఓటర్లను బెదిరిస్తున్నారని విపక్షాలు హైదరాబాద్- విజయవాడ రహదారిపై కొంతసేపు నిరసన వ్యక్తం చేశాయి. క్యాంపుల వారీగా తేరా చిన్నపరెడ్డి వర్గంలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండగా, పార్టీల వారీగా ఓటర్ల సంఖ్య చూస్తే కాంగ్రెస్‌కు ఎక్కువగా ఉన్నారు. క్రాస్ ఓటింగ్‌పై జోరుగా ప్రచారం సాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు నియోజక వర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 99.7 శాతం పోలింగ్ నమోదైంది. సిపిఎం ఎంపిటీసిలు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. 1260మంది ఓటర్లకు 1256 మంది ఓటు వేశారు. గద్వాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ తెరాసకు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లాలో రెండు నియోజక వర్గాలకు ఓటింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 771మంది ఓటర్లకు 769మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యాంపులు కాకుండా ఎవరికి వారు వచ్చి ఓటు వేయడంతో రెండు పార్టీల అభ్యర్థులు ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధాన అభ్యర్థులు ఇద్దరూ క్రాస్ ఓటింగ్‌పై ఆందోళన చెందుతున్నారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెదేపా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరావు విజయం మాదేనని ధీమా వ్యక్తం చేస్తుంటే, తెరాస అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ గెలిచి తీరుతామని చెబుతున్నారు. అయితే క్రాస్ ఓటింగ్ జరిగిందనే ఆందోళన ఇరువురు అభ్యర్థుల్లోనూ కనిపిస్తోంది. క్యాంపుల నుంచి నేతలు తమ ఓటర్లను పోలింగ్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. 726 ఓట్లకు, 692మంది తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. సిపిఐ ఎంఎల్ ఓటింగ్‌ను బహిష్కరించింది. అయితే కొందరు పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించి ఓటు వేశారు.

చిత్రం... ఖమ్మంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు