S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/11/2016 - 02:46

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, అధికార దుర్వినియోగం జరిగిందని, మంత్రుల జోక్యం చేసుకున్నారని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ జరిగిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. తాము ఈ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించే యోచన చేస్తున్నట్లు టిపిసిసి తెలిపింది.

02/11/2016 - 02:44

హైదరాబాద్: పదిహేను రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలంగాణ ఐటి, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె తారక రామారావు తెలిపారు. మున్సిపల్ శాఖను చేపట్టిన తరువాత తొలిసారిగా బుధవారం ఆయన సమీక్ష జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఆదాయం పెంచుకోవడానికి అధికారులకు పలు సూచనలు చేసినట్టు మీడియాకు తెలిపారు.

02/11/2016 - 02:42

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బొంతు రామ్మోహన్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. మేయర్ స్థానాన్ని బీసీలకు రిజర్వ్ చేశారు. దీంతో డిప్యూటీ మేయర్‌గా మైనారిటీని ఎంపిక చేయాలని నిర్ణయించారు. టిఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ రావడంతో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకున్నారు.

02/11/2016 - 02:12

హైదరాబాద్: తెలంగాణలో తెదేపా క్రమంగా ఖాళీ అవుతోంది. తెదేపా శాసన సభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సిఎం కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో క్యాంపు కార్యాలయంలో బుధవారం తెరాసలో చేరారు. తెలంగాణలో తెదేపా బతకదని, పార్టీని రక్షించుకోలేమని తేలిపోయిందని, అందుకే తెరాసలో చేరుతున్నట్టు దయాకర్‌రావు ప్రకటించారు.

02/10/2016 - 21:11

హైదరాబాద్-టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎర్రెబల్లి దయాకర్ రావు, ముఖ్యమంత్రి కేసిఆర్ చాలాకాలంగా రహస్యమిత్రులను టిడిపి సీనియర్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కులసమీకరణలు జరుగుతున్నాయని, అందువల్లే చేరికలు ఉధృతమయ్యాయని ఆయన అన్నారు. టిటిడిపిలో మాదిరిగానే టిఆర్‌ఎస్ పార్టీలోను, ఆయన కుటుంబంలోనూ మార్పులుంటాయని అన్నారు.

02/10/2016 - 20:56

హైదరాబాద్-తెలుగుదేశం పార్టీని వీడటం బాధాకరమేనని, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నానని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఆయన తెరాస తీర్థం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టిడిపి బతికిబట్టకట్టే స్థితిలో లేదని, గతంలో పార్టీ నిర్ణయం మేరకు కేసిఆర్‌ను విమర్శించానని అన్నారు.

02/10/2016 - 20:16

హైదరాబాద్- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో భవిష్యత్‌లో బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ ఉండవని, కఠిన నిర్ణయాలు తీసుకుంటామని మున్సిపల్, పంచాయతీరాజ్, ఐటిశాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ అభివృద్ధికోసం పదిహేనురోజుల్లోగా అజెండా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

02/10/2016 - 20:15

హైదరాబాద్-తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రా, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ స్వయంగా తెలిపారు. కొద్దిసేపటి క్రితం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వారితో మాట్లాడిన మంత్రి హరీష్‌రావు వారితో కలసి ముఖ్యమంత్రి వద్దకు బయలుదేరి వెళ్లారు. అధికారికంగా వారి చేరికపై ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.

02/10/2016 - 17:08

హైదరాబాద్- తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని, గోదావరి నీళ్లతో నియోజికవర్గం కాళ్లు కడుగుతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. బుధవారం నిర్వహించిన ఉపఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరంగల్, హైదరాబాద్‌లలో ప్రజలు ఇచ్చిన తీర్పు మాదిరిగానే నారాయణఖేడ్‌లోనూ ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టంగట్టాలని ఆయన కోరారు.

02/10/2016 - 11:49

నల్గొండ: బీబీనగర్‌లో ఏర్పాటు చేస్తున్న వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌కు నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా హామీ ఇచ్చారు. ఆయన బుధవారం యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే ప్రముఖ క్షేత్రంగా యాదాద్రి రూపొందుతుందన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Pages