తెలంగాణ

మేయర్ గద్దెపై బొంతు రామ్మోహన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బొంతు రామ్మోహన్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. మేయర్ స్థానాన్ని బీసీలకు రిజర్వ్ చేశారు. దీంతో డిప్యూటీ మేయర్‌గా మైనారిటీని ఎంపిక చేయాలని నిర్ణయించారు. టిఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ రావడంతో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకున్నారు. పంచాయితీరాజ్, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు నగరంలో పార్టీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అన్ని కోణాల్లో ఆలోచించి బొంతు పేరును ప్రతిపాదించారు. డిప్యూటీ మేయర్‌గా బోరబండ నుంచి గెలిచిన మైనారిటీ వర్గానికి చెందిన బాబా ఫషియుద్దీన్ పేరు ఖరారు చేశారు. మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించనందున మేయర్‌గా మహిళను నియమించాలని కొందరు సూచించారు. మేయర్ లేదా డిప్యూటీ మేయర్‌గా మహిళను నియమించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే నగరంలో వచ్చే సాధారణ ఎన్నికలకు పార్టీని పటిష్టపరిచే దిశగా ఆలోచించి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయ. తెలంగాణ ఆవిర్భావం తరువాత గ్రేటర్ హైదరాబాద్ నగర తొలి మేయర్ పదవిని బొంతు చేపట్టనున్నారు. తొలినుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బొంతు పేరును మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా ఉద్యమ కాలంలో పని చేసిన వారికి గుర్తింపు కల్పించినట్టు అయిందని పార్టీ నేతలు అంటున్నారు. ఈ నిర్ణయం మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి, ఉద్యమంలో కష్టనష్టాలు అనుభవించిన వారికి సంతోషం కలిగిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతను చేపట్టిన కెటిఆర్ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికలో ప్రధాన భూమిక పోషించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు అభ్యర్థుల పేర్లపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు తెలంగాణ భవన్‌లో కెటిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు, మంత్రులు, ఎక్స్ అఫిషియో సభ్యులు పాల్గొంటారు. మేయర్ అభ్యర్థి ఎంపికపై చర్చిస్తారు. బొంతు రామ్మోహన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై వివరిస్తారు. నగరంలో పార్టీ పటిష్టతకు కార్పొరేటర్లు కీలక భూమిక పోషించాల్సి ఉంటుందని వివరిస్తారు. లంచం ఇవ్వకుండా ప్రజలు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనులు చేయించుకునే రోజు వచ్చినప్పుడే నిజమైన విజయం అని ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇదే అంశాన్ని కెటిఆర్ కార్పొరేటర్లకు వివరిస్తారు. ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా గ్రేటర్‌లో పనులు జరిగేట్టు చూడాలని సూచించనున్నారు. కెటిఆర్ మున్సిపల్ వ్యవహారాల శాఖను సైతం నిర్వహిస్తున్నందున అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. కార్పొరేటర్లు పారదర్శకంగా పని చేయాలని కెటిఆర్ సూచించనున్నారు.