S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/10/2016 - 11:47

హైదరాబాద్: ఓ కాంట్రాక్టర్ నుంచి 1.37 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఇఇ మానిక్ ప్రభు ఏసిబి అధికారులకు బుధవారం చిక్కాడు. నల్గొండకు చెందిన ఈయన గుర్రంపూడి డివిజన్‌లో పనిచేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో సైదాబాద్‌లోని ఇంటిపై కూడా పోలీసులు దాడి చేశారు.

02/10/2016 - 11:46

హైదరాబాద్: వరంగల్ జిల్లా మేడారం వద్ద జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు నగరంలోని ఎంజిబిఎస్, జెబిఎస్, దిల్‌సుఖ్‌నగర్, నేరేడ్‌మెట్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి గంటకో బస్సును నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకూ నడుపుతారు.

02/10/2016 - 11:46

నల్గొండ: నాగార్జునసాగర్ సమీపంలో దెయ్యాలగండి వద్ద ఈ రోజు ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడగా, అందరూ క్షేమంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పటంతో అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.

02/10/2016 - 07:54

అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న మహబూబ్‌నగర్ జిల్లా, అలంపూర్‌లోని శ్రీ జోగులాంబదేవి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను మంగళవారం వైభవంగా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసమూర్తి, ఇఓ గురురాజ, చైర్‌పర్సన్ లక్ష్మినారాయణరెడ్డి ప్రారంభించారు. మాఘశుద్ధపాడ్యమి నుంచి మాఘశుద్ధపంచమి వరకు నిర్వహిస్తున్నట్లు చైర్‌పర్సన్ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు.

02/10/2016 - 06:59

హైదరాబాద్: బాల వికాస సంస్థ పేదలు, మహిళల కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, ఆ సంస్థకు ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎల్‌బి స్టేడియంలో మంగళవారం బాల వికాస సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యమంత్రి కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తదితర ప్రముఖులు హాజరయ్యారు.

02/10/2016 - 06:57

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ప్రపంచంలోనే అతి పెద్దదైన రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఉపాధ్యక్షుడు, లాటిన్ అమెరికా, ఆఫ్రికా సిఇఓ ఎన్‌రిక్ ఓస్టల్ తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావును సచివాలయంలో మంగళవారం కలిశారు. భారతదేశంలో వాల్‌మార్ట్ విస్తరణ ప్రణాళికను వివరించారు. హైదరాబాద్ నగరంలో మరిన్ని వాల్‌మార్ట్ స్టోర్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు.

02/10/2016 - 06:56

హైదరాబాద్, ఫిబ్రవరి 9: చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి అన్ని అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మినీ కల్చరల్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని, సినీ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆలోచిస్తోంది. సినిమా రంగ పరిశ్రమపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

02/10/2016 - 04:23

హైదరాబాద్: మెడికల్, అగ్రికల్చర్, ఫార్మా మినహా మిగతా అన్ని స్థాయిల విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖకే అప్పగించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. బడ్జెట్ రూపకల్పన సందర్భంగా వివిధ శాఖలను కూలంకషంగా ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. దీంట్లో భాగంగా విద్యాశాఖపై సిఎం దృష్టిసారించారు.

02/10/2016 - 04:21

హైదరాబాద్, ఫిబ్రవరి 9: శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతభత్యాలు పెంచడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి, అసెంబ్లీ కార్యదర్శికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ అంశంపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్, ఆర్థికశాఖ అధికారులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చర్చించారు.

02/10/2016 - 04:19

హైదరాబాద్: ఓ డాక్టర్‌పై కాల్పులకు పాల్పడిన ఘటనలో నిందితుడు శశికుమార్ మంగళవారం తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హిమాయత్‌నగర్‌లో ఇద్దరు డాక్టర్ల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారి తీసి కాల్పులకు దారితీసిన విషయం విదితమే. సంఘటనలో డాక్టర్ ఉదయ్‌పై కాల్పులకు పాల్పడిన శశికుమార్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లిలోని నిశా ఫాంహౌస్‌లో రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Pages