S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/09/2016 - 03:25

హైదరాబాద్/ మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖల్ పారిశ్రామికవాడలోని హసిత కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ముగ్గురు కార్మికులు సజీవ దహనమయ్యారు. ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా కాలిపోయాయి. తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫ్యాక్టరీలో కెమికల్ బ్యాగులు అప్‌లోడ్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది.

02/09/2016 - 03:21

హైదరాబాద్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. 11మంది కార్మికులు గాయపడిన సంఘటన సోమవారం సాయంత్రం ఎన్‌ఎఫ్‌సి నగర్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఎన్‌ఎఫ్‌సి పారిశ్రామికవాడలో కొత్తగా నిర్మిస్తున్న భవనం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. 40మంది కార్మికులు శ్లాబ్ వేస్తుండగా, ఇంకోవైపు శ్లాబ్ కుంగిపోయి ప్రమాదం సంభవించింది.

02/09/2016 - 03:33

హైదరాబాద్: నగరంలో సోమవారం సాయంత్రం కాల్పుల కలకలం చెలరేగింది. ఇద్దరు డాక్టర్ల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు తావిచ్చి కాల్పులకు తెరలేపింది. ఒక డాక్టర్‌పై మరో డాక్టర్ కాల్పులకు పాల్పడిన సంఘటన హిమాయత్‌నగర్‌లో సంచలనమైంది. ఘటనలో గాయపడిన వైద్యుడు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాదాపూర్‌లోని లారెల్ ఆసుపత్రి డైరెక్టర్ల సమావేశంలో జరిగిన గొడవే కాల్పుల ఘటనకు కారణమని తెలుస్తోంది.

02/08/2016 - 12:12

హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో దర్యాప్తు తీరు సరిగా లేదని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు తప్పుత్రోవ పట్టేలా దర్యాప్తు సాగుతోందని, దీన్ని సిబిఐకి అప్పగించాలా? అని కోర్టు వ్యాఖ్యానించింది. ఆస్తుల విలువపై కోర్టును పక్కదారిపట్టిస్తున్నారని అగ్రిగోల్డ్ యాజమాన్నాన్ని మందలించింది.

02/08/2016 - 12:10

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ రోజున కాంగ్రెస్ నేతలపై దాడికి సంబంధించిన కేసులో నిందితుడైన మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సోమవారం పోలీసులకు లొంగిపోయారు. అనంతరం ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఆయనను రిమాండ్‌కు తరిలిస్తారు.

02/08/2016 - 17:50

వరంగల్: ఓ మహిళను వివస్తన్రు చేసి, కామె శరీరంపై కాల్చిన ఇనుప చువ్వలతో గాయాలు చేసి వీధిలో ఊరేగించిన దారుణ ఉదంతం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డిసి తండాలో సోమవారం జరిగింది. ఈ గ్రామంలో రవి అనే వ్యక్తి రెండో భార్య అనితపై అతడి మొదటి భార్య బంధువులు కిరాతకంగా దాడి చేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు తండాకు చేరుకుని అనితను ఆస్పత్రికి తరలించారు.

02/08/2016 - 12:09

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

02/08/2016 - 12:06

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల్ పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఇదే ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రసాయనాలు కలిపే మిక్సింగ్ యంత్రంలో పేలుడు కారణంగా చత్తీస్‌గఢ్‌కు చెందిన అయిదుగురు కార్మికులతో పాటు అక్కడ ఇన్‌ఛార్జిగా పని చేస్తున్న మూర్తి అనే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.

02/08/2016 - 06:39

హైదరాబాద్/గచ్చిబౌలి, ఫిబ్రవరి 7: అక్రమార్జనతో జల్సాలకు అలవాటుపడ్డ జిహెచ్‌ఎంసి రెవెన్యూ సిబ్బంది సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు 24 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో పలువురు జిహెచ్‌ఎంసి ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది ఉద్యోగులను జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు.

02/08/2016 - 06:29

కామారెడ్డి: అన్ని వైపులా సమస్యలు చుట్టుముట్టి అధార్మిక శక్తులు విచ్చలవిడిగా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో హైందవ సమాజాన్ని వినాశనం నుంచి కాపాడేందుకు సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్నవారంతా విభేదాలను పక్కనపెట్టి ఏకం కావటం అత్యవసరమని ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్ర్తీ పిలుపునిచ్చారు.

Pages